భార్య చనువుగా వుండలేదని.. ప్రియుడి ఇంటికి నిప్పంటించాడు..

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (15:43 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ భర్త భార్య ప్రియుడి ఇంటికి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లిలో ఈ తరహా సంఘటన జరిగింది.
 
బెజ్జింకి మండలం ముత్తనపేటకు చెందిన ఓ వ్యక్తికి చిన్నకోడూరు మండలం చెల్కలపల్లికి చెందిన మహిళతో కొన్ని నెలల క్రితం పెళ్లి జరిగింది. కొని నెలల తర్వాత అతడు భార్యను చెల్కలపల్లిలోని పుట్టింట్లో వదిలేసి ఉపాధి కోసం ముంబైకి వెళ్లాడు.
 
ఆమె చెల్కలపల్లిలోని తన స్నేహితురాలి ఇంటికి తరచూ వెళ్లేది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆమె భర్త నెల రోజుల క్రితం తిరిగి వచ్చాడు. భార్య తనతో సరిగా ఉండడం లేదని అతడు అనుమానించడం మొదలు పెట్టాడు. స్నేహితురాలి తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించాడు. ఈ విషయమై ఆమెతో తరచూ గొడవపడే వాడు. 
 
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి చెల్కలపల్లికి వెళ్లి ఆ అనుమానిత వ్యక్తి ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు ఎగసి పడడంతో స్థానికులు అప్రమత్తమై ఆర్పేసారు. బాధితుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ

Singeetham: 40 ఏళ్ల కలని సక్సెస్ చేసిన ఘనత నాగ్ అశ్విన్ గారిదే : సింగీతం శ్రీనివాసరావు

Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి : నట్టికుమార్

Arnold Vosloo: రణబాలి సినిమాలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ లుక్

తర్వాతి కథనం
Show comments