Daily Horoscope
✕

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?

సెల్వి
శుక్రవారం, 6 నవంబరు 2026 (18:18 IST)
Diwali 2026
దీపాల పండుగ అయిన దీపావళిని చాలా మంది కేవలం వేడుకకు సంబంధించిన రోజుగానే భావిస్తారు. కానీ దీపావళి పండుగ మన ఇంట్లోనూ, జీవితంలోనూ సంతోషాన్ని, మంగళాన్ని, సంపదను శాశ్వతంగా ఉండేలా చేసే అద్భుతమైన పర్వదినం. ఇది మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే రోజుగా భావిస్తారు. ఈ రోజున తెలియకుండా ఈ తప్పులను చేయకూడదు. 
 
దీపావళి పండుగ అనేది మన ఇంట్లోనూ, జీవితంలోనూ ఉన్న అజ్ఞానం, దుఃఖం అనే చీకటిని తొలగించి, మేలు, సంతోషం, అభివృద్ధి, సంపద వంటి వాటిని ప్రసాదించేందుకు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి శక్తివంతమైన రోజుగా దీపావళి రోజును భావిస్తారు. అందువల్ల ఈ రోజున చేసే పూజలు, దానధర్మాలు, పూజా కార్యక్రమాలు మనకు ఎంతో గొప్ప ఫలితాలను, పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని నమ్మకం.
 
దీపావళి రోజున చేయకూడని 4 తప్పులు:
1. ఇంటిని చీకటిగా ఉంచడం - దీపావళి అనే పదానికి దీపాలను వరుసగా అమర్చి జరుపుకునే పర్వదినం అని అర్థం. దీపం అనేది మహాలక్ష్మి అంశంగా భావిస్తారు. అలాగే దీపపు జ్వాల అనేది త్రిమూర్తి దేవీలలో ఒకరైన జ్యోతి రూపంగా భావిస్తారు. అందువల్ల ఇంట్లో స్థిరంగా దైవ అనుగ్రహం, మహాలక్ష్మి కృప నిండి ఉండాలంటే దీపావళి రోజున ఇంటి ఏ మూలను కూడా చీకటిగా ఉంచకూడదు. అలా చీకటిగా ఉండే ఇంటి నుండి మహాలక్ష్మి దేవి బయటకు వెళ్లిపోతుందని చెబుతారు. 
 
2. లక్ష్మీ కుబేర పూజను వదిలేయడం - దీపావళి రోజున మహాలక్ష్మి దేవి ప్రతి ఇంటికి విచ్చేసి ఆశీస్సులు అందిస్తుందని ఐతిహ్యం. కుబేరుడు ఈ రోజునే లక్ష్మీ దేవిని పూజించి తాను కోల్పోయిన సంపదలన్నింటినీ పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహాన్ని కూడా పొంది ఇంట్లో శాశ్వత సంపదను పొందేందుకు దీపావళి రోజున సాయంత్రం వేళ ఇంట్లో లక్ష్మీ కుబేర పూజ చేయకుండా ఉండకూడదు. 
 
3. అప్పు ఇవ్వడం - దీపావళి రోజున ఇతరులకు అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం మానుకోవాలి. ఇది లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేయడంతో సమానం. 
 
4. గొడవపడటం - దీపావళి రోజున ఇంట్లో ఉన్నవారితోనూ ఇతరులతోనూ ప్రేమను, సంతోషాన్ని, శుభాకాంక్షలను మాత్రమే పంచుకోవాలి. ఎవరితోనూ గొడవపడటం గానీ, కోపంతో కూడిన మాటలు మాట్లాడటం గానీ, ఇతరులను మనసు నొచ్చుకునేలా చేయడం గానీ, ఏడవడం గానీ మానుకోవాలి. ఇవి శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహానికి అడ్డుకట్టలా మారుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అందుకే ఈ రోజున ప్రశాంతంగా మనస్సును వుంచుకోవాలి. హడావుడిగా కాకుండా మనస్సును ఆహ్లాదకరంగా వుంచుకుని లక్ష్మీ పూజ చేయడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 

Related News

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై పొలంలో సామూహిక అత్యాచారం, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న బాధితురాలి వీడియో

భార్య కళ్ల ముందే హిస్టరీ షీటర్ హత్య.. డీజే సౌండ్ వివాదం, పాత గొడవలే కారణమా?

హైదరాబాదును నిరాశపరిచిన రుతుపవనాలు.. 34శాతం వర్షం లోటు.. కారణం ఏంటంటే?

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే..?

దీపావళి కానుకగా హైదరాబాదులో మెట్రో, ఆర్టీసీ పాసుల ధరల తగ్గింపు

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2026.. ఏ రోజున జరుపుకోవాలి.. దీపాలను వెలిగించడం ఎందుకంటే?

ధన త్రయోదశి నాడు ఈ 5 పనులు తప్పక చేయండి

06-11-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులొద్దు

శబరిమల యాత్ర.. భక్తుల కోసం ప్రత్యేక కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు : టీజీఎస్సార్టీసీ

05-11-2026 గురువారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే?

తర్వాతి కథనం
Show comments