Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్‌పై కొంచెం ఇంగువ వేసి వేడిచేసి...?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:13 IST)
కొందరికి గోరింటాకు అంటే పిచ్చి ప్రాణం. కానీ, పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే పోతుంది. అలాంటి మృదువైన చేతుల్ని ముద్దులొలికే విధంగా చేసుకోవచ్చు. ఎంతో కష్టపడి వేసుకున్న మెహందీ డిజైన్లు ఎక్కువకాలం ఉండాలంటే కింది సూచనలు పాటించాలంటున్నారు. 
 
గోరింటాకు పేస్ట్‌ డిజైన్‌ రూపంలో చేతులపై తీర్చిదిద్దాక వీలైనంత ఎక్కువ సమయం అలానే ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి. చక్కెర, నిమ్మరసాల మిశ్రమాన్ని మాటిమాటికీ అరచేతులపై అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే గోరింటాకు ఎండిపోకుండా ఉంటుంది. అలానే వీలైనంత ఎక్కువ వెచ్చదనాన్ని అందజేయాలి. 
 
ఇంట్లో ఉండేవారు పాన్‌పై కొంచెం ఇంగువ వేసి వేడిచేసి వచ్చే పొగపై చేతులను పెట్టి కాచుకోవాలి. మాటిమాటికీ గోరింటాకును చేతులతో కదిపే ప్రయత్నం చెయ్యకూడదు. గోరింటాకు పౌడర్‌ను ముందుగా నీళ్లల్లో నానబెట్టి అందులో అరచెమ్చా కాసు వేసి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. 
 
పిప్పర్‌మెంట్‌ను నూరి గోరింటాకు పేస్ట్‌కు కలిపితే అది బాగా ఎర్రగా పండుతుంది. మార్కెట్లో పిప్పర్‌మెంట్‌ నూనె లభిస్తుంది. ఒకసారి తయారు చేసుకున్న గోరింటాకు పేస్ట్‌ను మళ్ళీ ఇంకోసారి ఉపయోగించుకోవాలని అనుకునేవారు దీనిని ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments