సోదరునికి సోదరి రాఖీ ఎప్పుడు కట్టాలంటే..?

సోదరునికి సోదరి రాఖీ ఎప్పుడు కట్టాలంటే..? శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటుస్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (15:43 IST)
సోదరునికి సోదరి రాఖీ ఎప్పుడు కట్టాలంటే..? శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటుస్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో రాఖీ కట్టాలని పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత నోరు తిపి చేయడం సంప్రదాయం.
 
మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు, మధ్యాహ్న వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని, ఆ సమయంలోనే రాఖీని కట్టించుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక పెళ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం సంప్రదాయం. 
 
పూర్వకాలంలో భర్తకి భార్య రక్షణ కోసం రాఖీని కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకువెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీ పౌర్ణమీ రోజు కట్టే రక్షలో ఆసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఔను... నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి, వీడియో

బస్సులో జర్నీ చేసిన తమిళనాడు సీఎం విజయ్ (video)

గంగా- కావేరీ నదులను అనుసంధానించడం నా జీవిత ఆశయం: చంద్రబాబు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

తర్వాతి కథనం
Show comments