Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

సిహెచ్
సోమవారం, 3 జూన్ 2024 (20:26 IST)
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, కె ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలతో ఇంకా ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది.
లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది. 
ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
లవంగాలు నోటి పూత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది.
రోజూ లవంగం తీసుకుంటే కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి.
లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గించి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి.
లవంగాలు తింటుంటే మగవారిలో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. 
లవంగం నూనె మొటిమలను తగ్గించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ బాగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టిన భర్త.. తర్వాత భయంతో ఆత్మహత్య!!

ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.. పాకిస్థాన్ వెళతా : కర్నాటక మంత్రి (Video)

భారతీయ వంట మనిషిని ఉరితీసిన కువైట్!!

వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!

బాబ్బాబు.. మీకు దణ్ణం పెడతాం.. భారత్ దాడి నుంచి రక్షించండి.. గల్ఫ్ దేశాలకు పాక్ వినతి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

తర్వాతి కథనం
Show comments