కోడిగుడ్లు తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (22:08 IST)
చెడు కొవ్వు.. బ్యాడ్ కొలెస్ట్రాల్. దీనితోనే ఇప్పుడు వస్తున్న ఇబ్బంది అంతా. ఇదివరకు ఎలాంటి కొవ్వైనా సరే భౌతకమైన శ్రమ వుండటంతో కరిగిపోయేది. కానీ ఇప్పుడలా కాదు. గంటలకొద్దీ కుర్చీల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగాలు. దీనితో విపరీతంగా కొవ్వు పేరుకుపోతోంది. అందువల్ల తినే ఆహార పదార్థాల్లో చెడు కొవ్వు వేటిలో ఎంతెంత వుందనేది చూసుకోవాల్సి వస్తుంది.
 
కోడిగుడ్డు విషయానికి వస్తే... ఆరోగ్యకరమైన వ్యక్తులకు రోజుకు 3 గుడ్లు సంపూర్ణంగా సురక్షితం అని సైన్స్ స్పష్టం చేసింది. గుడ్లు స్థిరంగా HDL (మంచి) కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. 70% మంది విషయంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుదల లేదు. ఐతే 30 శాతం మందిలో LDL... అంటే చెడు కొలెస్ట్రాల్ కాస్త చేరినట్లు తేలింది. దీనికి ఖచ్చితంగా కోడిగుడ్డు అని చెప్పలేదు.
 
ఇకపోతే గుడ్లు తిననివారి కంటే గుడ్లు తినేవారిలో గుండెజబ్బుల ముప్పు తక్కువగా ఉంటుంది. అయితే, మధుమేహం (ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్) ఉన్నవారిలోనూ గుడ్డు వల్ల గుండెజబ్బుల ముప్పు తగ్గినట్లు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
 
గుడ్డు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలపై వీరు అధ్యయనం చేశారు. వారానికి 12 గుడ్లు చొప్పున ఏడాదిపాటు తినడం ద్వారా మధుమేహం, టైప్-2 మధుమేహంతో బాధపడేవాళ్లలో గుండెజబ్బులతో వచ్చే ప్రమాదం తగ్గుతుందని గుర్తించారు. మూడు నెలల క్రితం జరిపిన అధ్యయనంలో కూడా ఇటువంటి ఫలితాలే వెల్లడి కావడంతో పరిశోధనను పొడిగించారు. 
 
పరిశోధన ప్రారంభంలో పాల్గొన్న వారికి గరిష్ఠంగా వారానికి 12 గుడ్లు, కనిష్ఠంగా వారానికి 2 కంటే తక్కువ గుడ్లు తినాలని సూచించారు. మూడు నెలలు చివరి రోజుల్లో గుడ్లు తిన్నవారిలో హృదయరోగ సంబంధిత వ్యాధులకు కారణమైయ్యే ప్రమాద కారకాలను గుర్తించలేదు. పరిశోధనలో పాల్గొన్నవారిని మూడు గ్రూపులుగా విభజించారు. మూడునెలలపాటు వీరికి గుడ్లు అందించారు. మొదటి గ్రూపు వారికి గుడ్లు తక్కువ, ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. 
 
రెండో గ్రూపువారికి బరువు తగ్గేలా డైట్‌ ఫుడ్‌ను ఇస్తూ మొత్తం మూడు నెలలు అదనంగా ఇచ్చారు. ఇక చివరి గ్రూపువారికి మిగతా ఆరునెలలు నుంచి పన్నెండు నెలల పాటు అదే మోతాదులో గుడ్లను తినాలని సూచించారు. గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. గుడ్డు తినడం వల్ల కళ్లు, గుండె ఆరోగ్యం, రక్తనాళాలకు ఎంతో మేలు కలుగుతుందని వారంటున్నారు. ముఖ్యంగా గర్భవతులకు ఎంతో ఆరోగ్యకరమని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైజాగ్ మీదుగా వెళ్లేవాడిని, ఇండియా మార్పు వేగం ఆశ్చర్యపరుస్తోంది: సుందర్ పిచాయ్

రేపిస్ట్ కులవర్థన్ అంత్యక్రియలు పూర్తి.. చెత్త తొలగించే ఆటోలో మృతదేహం తరలింపు..

టీవీ సౌండ్ తగ్గించమని కోరిన భర్త.. దారుణంగా కత్తితో పొడిచి చంపేసిన భార్య

నా అన్వేషణ ఇన్‌స్టాగ్రాం అకౌంట్ బ్యాన్, అప్పుడు వినిసావు అన్నాడు, ఇప్పుడు చూసేందుకు అక్కడ ఏమీలేదు

రాజస్థాన్‌లో కలకలం ... రాహుల్ గాంధీని కాల్చిపడేస్తానన్న వ్యక్తి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

తర్వాతి కథనం
Show comments