Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకర్షణీయమైన బెల్లీ కోసం.. ముడిబియ్యం..

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:43 IST)
బెల్లీ అందంగా వుండాలనుకుంటే.. ఆహారంలో మార్పులు తప్పనిసరి అంటున్నారు న్యూట్రీషియన్లు. ఆహారంలో తీసుకునే జాగ్రత్తల ద్వారా శరీరాకృతిని మెరుగ్గా వుంచుకోవచ్చు. ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. తద్వారా నిత్యయవ్వనులుగా కనిపించవచ్చునని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.


అందుకే ఫైబర్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వైట్ బ్రెడ్, బంగాళాదుంపలు, అన్నం తగినంత తీసుకోవాలి. పాలు తాగే అలవాటున్నవారు కొవ్వులేని పాలును తీసుకోవడం మంచిది. 
 
కనీసం వారంలో మూడుసార్లయినా సుమారు అరగంటపాటు నడకను గానీ, వ్యాయామంకానీ చేయాలి. ఇలా చేయడం ద్వారా పొట్టవద్ద చేరిన కొవ్వు కరిగి స్లిమ్‌గా మారుతుంది. ఇంకా చెప్పాలంటే గోధుమ రొట్టెలకంటే ముడిబియ్యాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వండి. ఇవి పొట్టలో కొవ్వు చేరకుండా చూడటంలో సహాయపడతాయి. 
 
కూర్చుని పనిచేసే ఉద్యోగం చేసేవారైతే కనీసం గంటకోసారి కుర్చీలోంచి లేచి ఓ ఐదు నిమిషాలు అటుఇటు తిరిగి రావడం మంచిది. లేదంటే బానపొట్ట పెరగడం ఖాయం. అలాగే ఉదయం పూట అర గుప్పెడు బాదం పప్పులు తీసుకోవాలి.
 
రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని సేవించాలి. ఒకేసారి భారీగా భోజనాన్ని లాగించేయకుండా రెండు మూడుసార్లు కొద్దికొద్దిగా తినడం ద్వారా పొట్ట పెరగదు.. ఇంకా ఆకర్షణీయమైన బెల్లీ మీ సొంతం అవుతుందని న్యూట్రీషియన్లు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments