Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిక్కల్ని తగ్గించుకోవాలంటే.. సైక్లింగ్ చేయండి.. 2 కప్పుల గ్రీన్ టీ తాగండి

మహిళలూ కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా? అయితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటే తొడలు, పిక్కలు, పొట్ట పెరిగిపోతాయి. ఈ ప్రాంతాల్లో కొవ్వ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (11:34 IST)
మహిళలూ కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా? అయితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటే తొడలు, పిక్కలు, పొట్ట పెరిగిపోతాయి. ఈ ప్రాంతాల్లో కొవ్వు చేరడం ద్వారా మధుమేహం, గుండె జబ్బులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో 87 శాతం మంది మహిళలు అధిక బరువుతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే పిక్కలతో పాటు తొడలు, పొట్టను బాగా తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చునని వారు సూచిస్తున్నారు. 
 
ఇందుకు ఏం చేయాలంటే.. 
రోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. గ్రీన్ టీ తాగాలి. రోజూ రెండు కప్పుల గ్రీన్‌టీ తాగడం ద్వారా తప్పకుండా పిక్కల బరువు తగ్గుతుంది. ఈ సమస్య ఉన్నవారు రోలింగ్‌ వ్యాయామాలు చేయాలి. పిరుదుల మీద భారంవేస్తూ అటూ, ఇటూ కదిలే ప్రయత్నం చేయాలి. ఆ ప్రాంతంలో రక్తప్రసరణ బాగా పెరిగి కొవ్వు కరుగుతుంది. అలాగే సైకిలు ఎక్కువగా తొక్కడం వల్ల కూడా ఆ సమస్య అదుపులో ఉంటుంది. ఇంకా బొప్పాయి, క్యారెట్‌, టొమాటో, చిలగడదుంపలు ఎక్కువగా తినాలి. వాటిలోని యాంటీఆక్సిడెంట్లు ఈ సమస్యని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments