Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చికెన్ తింటే వేడి చేస్తుంది.. ఎందుకని?

వేసవిలో కాకుండా శీతాకాలమైనా, వర్షాకాలమైన చికెన్ తింటే చాలామందికి వేడి చేస్తుంది. అందుకనే చికెన్ అంటే చాలామంది అస్సలు ముట్టుకోరు. అలాగే ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న చేపలు, మినుములు, కోడిగుడ్లు వంటివి తీసు

Webdunia
మంగళవారం, 16 మే 2017 (11:01 IST)
వేసవిలో కాకుండా శీతాకాలమైనా, వర్షాకాలమైన చికెన్ తింటే చాలామందికి వేడి చేస్తుంది. అందుకనే చికెన్ అంటే చాలామంది అస్సలు ముట్టుకోరు. అలాగే ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న చేపలు, మినుములు, కోడిగుడ్లు వంటివి తీసుకుంటే శరీరం వేడెక్కేందుకు జీవక్రియలు మామూలు కంటే అదనంగా పనిచేస్తుంది.

అందుకని శరీరం వేడెక్కుతుందనే కారణంగా ప్రోటీన్ ఫుడ్ తినడం మానేయకూడదు. అలా మానేస్తే శరీరానికి కావలసిన శక్తి అందదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరం వేడి కాకుండా ఉండాలంటే.. ప్రోటీన్లు ఎక్కువగా గల ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ నీరు తాగాలి.
 
ప్రొటీన్‌ ఆహారం కండరాల పుష్టికే కాకుండా ఎముకల మీద అదనపు భారం పడి ఆస్గియో ఆర్థరైటిస్‌ వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి అవసరమైన ఈ విషయాన్ని గమనించకుండా.. శరీరానికి ఏ కాస్త వేడి చేసినా కొందరు ప్రోటీన్ ఆహారం తీసుకోవడం మానేస్తారు. ఫలితంగా శరీరం నానాటికీ బలహీనపడుతూ వెళుతుంది. 
 
అందుకే ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం మానేస్తే శరీరానికి కావలసిన ప్రోటీన్లు అందవు. నీళ్లతో పాటు నిమ్మనీళ్లు తాగాలి. అయితే ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. దీనివల్ల జీవక్రియల అదనపు శ్రమ తగ్గుతుంది. ఇంకా శరీర ఉష్ణోగ్రత మామూలు స్థితిలోనే ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments