మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

సిహెచ్
బుధవారం, 3 సెప్టెంబరు 2025 (14:18 IST)
మెుక్కజొన్నలో శరీరానికి అవసరమైన పోషకాలు వున్నాయి. వర్షాకాలంలో వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తింటుంటే ఆ మజా వేరు. మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్-ఇ, బి-1, బి-6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్దకం, మెులలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ను అరికడుతుంది.
 
ఎముకల బలానికి పోషకాలైన కాపర్ ఐరన్ ఇంకా అవసరమైన లవణాలు, మినరల్స్ అన్ని మెుక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయి. పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అధికం. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా మొక్కజొన్నలో ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలో మొక్కజొన్నలు ఎంతగానో ఉపయోగపడతాయి.
 
మెుక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమేకాదు.. శరీరంపై ముడతలు రాకుండా చేస్తుంది. మెుక్కజొన్న గింజల నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మ మంటలను, ర్యాష్‌లను తగ్గిస్తుంది.
 
రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న ఒక అద్భుతమైన వరం. మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల వృద్ధి చేస్తుంది. మొక్కజొన్న రక్తకణాల్లో కొలెస్ట్రాల్ ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు పక్షవాతం బీపీ మొదలైన వాటి సమస్యలు అదుపులో ఉంచుతుంది.
 
రోజూ మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి జుట్టును స్మూత్‌గా, మంచి షైనింగ్‌గా ఉండేలా చేస్తుంది. మొక్కజొన్న తక్షణ శక్తిని ఇచ్చే ఆహారపదార్ధం. దీనిని తినడం వలన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో ఖనిజాలు పోషకాల శాతం కూడా ఎక్కువగానే.
 
మొక్కజొన్న తరచుగా తినడం వల్ల హైపర్టెన్షన్ కూడా దూరం అవుతుంది. బీపీ షుగర్ గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న. అందుకే వర్షాకాలంలో సరదాకి తినడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే మొక్క జొన్నను మీ ఆహారంలో భాగం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అత్తారింటికి వెళ్లిన కూతురు ఆర్జించే డబ్బులో సగం పుట్టింటికా? ఇదేదో ఆలోచించాల్సిందే, వీడియో

Rowdy Sheeter: రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్య

గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం ప్రారంభం

సింగపూర్‌లో వజ్రం చోరీ కేసు : భారతీయుడికి రెండేళ్ల జైలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్య బాబాయ్ త్వరగా కోలుకోవాలి : నందమూరి బ్రదర్స్

షూటింగులో గాయపడిన నందమూరి బాలకృష్ణ

Balakrishna injured : కాకినాడలో నందమూరి బాలకృష్ణ కు గాయాలు 15రోజుల విశ్రాంతి

Yash: యష్, తారా సుతారియా లమధ్య విరహంతో కూడిన కెమిస్ట్రీ హైలైట్ గా సాంగ్

Karti: కార్తి... సర్దార్ 2' నుంచి ఎస్.జే. సూర్య స్టైలిష్ ఫస్ట్ లుక్.. సినిమా సెప్టెంబర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments