Daily Horoscope
✕

రక్తపోటును బీట్‌రూట్ రసం తగ్గిస్తుందా?

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (20:34 IST)
అధిక రక్తపోటు... అదే హైపర్ టెన్షన్. ఇటీవలి కాలంలో ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య. దీనికి మాత్రలు వేసుకుంటూ వుంటారు చాలామంది. ఆ సంగతి అలావుంచితే హైపర్ టెన్షన్‌ను సహజసిద్ధంగా తగ్గించేందుకు బీట్ రూట్ రసం ఉపయోగపడుతుందని అంటున్నారు పరిశోధకులు. అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటల పాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. 
 
పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉన్నట్టు వెల్లడైంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్ధిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, నైట్రేట్‌ సమృద్ధిగా ఉండే కూరగాయల్లోని నైట్రేట్‌లో అధిక రక్తపోటును తగ్గించేందుకు తోడ్పడే అంశాలున్నాయని స్పష్టమయ్యింది. మన శరీరంలో ఆహారంలోని నైట్రేట్‌ను నైట్రిట్‌ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. దీనికి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గించే గుణం ఉందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్సనల్ విషయాలపై నో కామెంట్.. టీడీపీ, వైకాపా సైలెంట్

పవన్ కల్యాణ్ వివాహ జీవితం.. నందిని నుంచి అన్నా వరకు.. కారణాలపై రచ్చ రచ్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం.. చలి, పొగమంచు, ఆకస్మిక వర్షాలు.. తెలుగు ప్రజలకు అలెర్ట్

బాత్రూమ్‌లో జారిపడ్డాడు.. గుండెపోటు వచ్చింది.. భర్తను అలా హత్య చేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మొదటి వ్యాపారం విఫలమైంది.. కానీ విలువైన పాఠాలు నేర్చుకున్నా... సమంత

పవన్‌ కల్యాణ్‌తో ఆ 14 ఏళ్లు.. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణూ దేశాయ్

Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?

Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్

తర్వాతి కథనం
Show comments