Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాగన్ ఫ్రూట్ తింటే బరువు ఇట్టే తగ్గిపోతారట..

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (12:18 IST)
డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. బరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. మధ్యలో గింజలుంటాయి. ఇవి అరటిపండ్లలో గింజల్లా ఉంటాయి. అందువల్ల ఈ పండును తినేవారు గింజలతో సహా తీసుకోవాలి. ఆ గింజలు కరకరలాడుతాయి. 
 
డ్రాగన్ పండ్లలో విటమిన్ సీ, ఈ పెద్ద మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా ఎక్కువే. అందువల్ల ఈ పండ్లు ఎంత తింటే అంత చురుకుగా మారతారు. చాలా శక్తి వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచివి. డ్రాగన్ ఫ్రూట్స్‌లో అరిగిపోయే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుండెకు కూడా ఈ పండ్లు మేలు చేస్తాయి. 
  
డ్రాగన్ ఫ్రూట్ శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను, మంచి కొవ్వు పదార్థాలతో బదిలీ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే మోనోసాచురేటేడ్ ఫ్యాట్‌లు గుండె ఆకారాన్ని గొప్పగా ఉండేలా ప్రోత్సహిస్తాయి. 
 
డ్రాగన్ ఫ్రూట్, కాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్ మరియు ఫైబర్‌లను కలిగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు, చర్మానికి మేలు చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ను దంచి, తేనె కలిపి, సహజయాంటీ ఏజింగ్ మాస్క్‌ను తయారు చేయవచ్చు. అంతేకాకుండా, దీని వాడకం ద్వారా మొటిమల నుండి ఉపశమనం కూడా పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగాల్ బాలుడికి వింత వ్యాధి - నీటి కుంటలోనే జీవనం - అనంత్ అంబానీ అండ

పెళ్లి ముచ్చట తీరకముందే విషాదం - మార్కులు తక్కువ వచ్చాయని నవ వధువు సూసైడ్

ఇంటి అద్దె చెల్లించాలని కోరిన యజమాని.. చంపేసిన టెనెంట్

విద్యార్థుల కంటే మంత్రుల గృహాల్లోని కుక్కలకే మెరుగైన సౌకర్యాలు : కాక్రోచ్ పార్టీ నేత దీప్కే

August 21, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Red Bag' Movie Review: మాతృప్రేమ,స్త్రీ శక్తిని చాటే చిత్రంగా ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ:

Allari Naresh: రంభ ఊర్వశి మేనక నుంచి బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్

Venkatesh : కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా అనౌన్స్ మెంట్

Jyothi Poorvazh: జ్యోతి పూర్వజ్.. కిల్లర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్

Venky Atluri :సూర్య గారిని దృష్టిలో ఉంచుకొని కథ రాయలేదు : వెంకీ అట్లూరి

తర్వాతి కథనం
Show comments