Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చితే?

మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహాన్ని దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు మునగాకును వారంలో రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని విటమిన్ సి

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (12:20 IST)
మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహాన్ని దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు మునగాకును వారంలో రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని విటమిన్ సి ఎముకలను బలపరుస్తుంది.

ఇందులో విటమిన్ ఎ, సిలే కాకుండా క్యాల్షియం, ఐరన్ ఫాస్పరస్ ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకును పచ్చడి లేదా కూర చేసుకుని తింటే ఆరోగ్యానికి శక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాంటి మునగాకుతో పచ్చడి చేసుకుని తింటే.. వర్షాకాలంలో ఏర్పడే జలుబు, జ్వరం దూరమవుతుంది. 
 
మునగాకు పచ్చడి ఎలా చేయాలంటే.. ఒక పాన్‌లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేగాక ప్లేటులోకి తీసుకుని పక్కనబెట్టుకోవాలి. ఆ తరువాత రెండు కప్పుల మునగాకు అదే పాన్‌లో కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
 
ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందు వేంపిన దినుసులన్నీ వేసి మిక్సి పట్టి ఆ తరువాత మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని.. మరో పాన్‌లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి తాలింపు పెట్టి రబ్బుకున్న పచ్చడి అందులో వేసి కలిపి దించేయాలి. అంతే మునగాకు పచ్చడి రెడీ అయినట్లే. మునగాకును  ఇలా పచ్చడిగా లేకుంటే తాలింపుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

తర్వాతి కథనం
Show comments