Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలా? ఐతే రైస్‌ను పక్కనబెట్టేయండి.. ఓన్లీ ఫ్రూట్స్ & వెజిటబుల్స్ తీసుకోండి..

కంప్యూటర్ల ముందు గంటల గంటలు అతుక్కుపోతున్నారా? తద్వారా బరువు పెరిగిపోయారా? ఐతే రైస్ పరిమాణం తగ్గించేయండి. లేదా రైస్‌ను పూర్తిగా పక్కనబెట్టి.. పండ్లు, కూరగాయలను తినడం మొదలెట్టండి. సలాడ్స్ రూపంలో వీటిని

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (14:06 IST)
కంప్యూటర్ల ముందు గంటల గంటలు అతుక్కుపోతున్నారా? తద్వారా బరువు పెరిగిపోయారా? ఐతే రైస్ పరిమాణం తగ్గించేయండి. లేదా రైస్‌ను పూర్తిగా పక్కనబెట్టి.. పండ్లు, కూరగాయలను తినడం మొదలెట్టండి. సలాడ్స్ రూపంలో వీటిని తీసుకుంటే కచ్చితంగా మూడు నెలల్లో బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు ఫుల్‌గా లాగించకుండా కొంచెం కొంచెంగా రైస్ తీసుకుని.. మిగిలిన సమయాల్లో స్నాక్స్‌కు బదులు కీర, టమోటా, బ్రొకోలీ, ఉల్లిపాయ ముక్కల్ని నమిలితే బరువు తగ్గిపోతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పండ్లలో సిట్రస్ పండ్లను అధికంగా తీసుకోవాలి. ఆరెంజ్, నిమ్మ పండ్ల రసాన్ని రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. రోజూ 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఆమ్లా రసంతో కాస్త అల్లం రసాన్ని కలిపి రోజూ ఉదయం పూట తాగితే శరీరంలో ఫాట్ కరిగిపోతుంది. అలాగే క్యారెట్‌తో పాటు తేనెను కలుపుకుని తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మటాష్ అవుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. వేడినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే బరువు తగ్గుతారు. ఈ జ్యూస్‌ను రోజుకు మూడు లేదా నాలుగుసార్లు తీసుకోవడం మంచిది. 
 
అయితే ఆహారం తీసుకున్న తర్వాతే వేడినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి. ఇంకా  బరువు తగ్గాలంటే.. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. ఇంకా రోజువారీ డైట్‌లో కీరదోస, ఉసిరి, కొత్తిమీర, మునగ, ద్రాక్ష, ఆరెంజ్, టమోటా, బొప్పాయి, అనాస, నిమ్మ, జామకాయ, పుదీనా, ఉల్లిపాయలు, కర్బూజ, కరివేపాకు, అరటి కాడ జ్యూస్ వంటివి చేర్చుకుంటే 3 నెలల్లో బరువు తగ్గుతారని న్యూట్రీషన్లు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments