Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో స్పూన్ నెయ్యి మంచిదే..

రోజుకో స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయ్యి పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కొవ్వులో కరిగే విటమిన్‌ల

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (14:26 IST)
రోజుకో స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయ్యి పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కొవ్వులో కరిగే విటమిన్‌లైన ఎ, డి, ఇ, కె నెయ్యిలో అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి మెదడు, గుండె, ఎముకల పనితీరును మెరుగుపరుస్తాయి.

నెయ్యిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే, దీనిలోని ఫ్యాటీ ఆమ్లాలు ఇతర కణజాలాల్లోని కొవ్వును కూడా కరిగించడానికి సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
పాల ఉత్పత్తుల్లో ఒకటైన నెయ్యిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నెయ్యి శక్తినిస్తుంది. అందుకే రోజుకో స్పూన్ మోతాదులో పెద్దలు నెయ్యిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. ఇక పిల్లలకైతే రాత్రిపూట కాకుండా ఉదయం, మధ్యాహ్నం పూట భోజనంలో నెయ్యిని రెండు స్పూన్ల మేర వాడితే మంచి ఫలితం వుంటుంది. 
 
నెయ్యిలో ఉండే బ్యూటరిక్‌ యాసిడ్‌, కడుపులో ఆమ్లాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. జీర్ణక్రియకు అవసరమయ్యే ఆమ్లాలను స్రవించేలా శరీరాన్ని ప్రోత్సహిస్తుంది. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

తర్వాతి కథనం
Show comments