Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగతో ఆ సామర్థ్యం పెరుగుతుంది.. చర్మం కాంతివంతంగా..

మునగను వారానికి రెండు సార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మునగ ఆకు, మునగ కాయల్లో ఐరన్ పుష్కలంగా వుండటమే ఇందుకు కారణం. మునగాకును ఎ

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (13:35 IST)
మునగను వారానికి రెండు సార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మునగ ఆకు, మునగ కాయల్లో ఐరన్ పుష్కలంగా వుండటమే ఇందుకు కారణం.

మునగాకును ఎండబెట్టినా అందులోని పోషకాలు ఏమాత్రం నశించవు. మునగాకును శుభ్రంగా ఎండబెట్టి కరివేపాకు పొడిలా తయారు చేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మునగకాయల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. 
 
ఇది పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్యం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో సంతానలేమి దూరమవుతుంది. ఇంకా వారానికి మూడు సార్లు మునగకాయల్ని వంటల్లో చేర్చుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. 
 
మునగకాయల్లో ఉండే విటమిన్ సి అనారోగ్య రుగ్మతలను దూరం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి మునగ ఎంతో మేలు చేస్తుంది. మునగకాయలను వారానికి ఐదుసార్లు తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments