Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌగలించుకోకపోతే అవి కోల్పోయినట్లే....

మీ ఆత్మీయులను ప్రేమతో పలకరించడమే కాదు. అప్పుడప్పుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోండి. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు. నిజం. కౌగిలింత ఒక నమ్మకం, ఒక భరోసా. ఈ కౌగిలింత వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (18:19 IST)
మీ ఆత్మీయులను ప్రేమతో పలకరించడమే కాదు. అప్పుడప్పుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోండి. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు. నిజం. కౌగిలింత ఒక నమ్మకం, ఒక భరోసా. ఈ కౌగిలింత వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...
 
అమ్మానాన్నాల ప్రేమని, ప్రేయసి ప్రియుల పరవశాన్ని, అక్కాచెల్లెళ్ల, అన్నదమ్ముల అనురాగాన్ని, స్నేహితుల భాందవ్యాన్ని, క్రీడాకారుల విజయోత్సాహాన్ని... ఒకటనేమిటి అన్ని రకాల భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తం చేయగలిగే చక్కని పలకరింపే కౌగిలింత.
 
1. నవ్వులానే అనేక వ్యాధుల నివారణకు బిగి కౌగిలి అద్భుత చికిత్స. నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒత్తిడి, డిప్రెషన్, భయాందోళనలను తగ్గిస్తుంది. చిన్నిపిల్లల్ని కుటుంబ సభ్యులంతా ఎత్తుకుని హత్తుకునే ఆ స్పర్శలోని వెచ్చదనం పెద్దయ్యేవరకు కూడా నరాల్లో అంతర్లీనంగా దాగే ఉంటుంది. కౌగిలింతలకు నోచుకోని పిల్లల్లో ఐక్యూ మందగిస్తుందనీ ఫలితంగా నడవడం, మాట్లాడటం, చదవడం.... ఆలస్యమవుతాయన్నది ఓ అధ్యయనంలో తేలింది. 
 
2. కౌగిలింత వల్ల పాజిటివ్ ఎనర్జీ ఒకరి నుంచి మరొకరికి ప్రసరిస్తుంది. దాంతో థైమస్ గ్రంధి ప్రభావితమై తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎక్కువై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 
3. ఆలింగనం కండరాల్ని వ్యాకోచించేలా చేయడంతో రక్తప్రసారం మెరుగై కణజాలాలు మృదువుగా మారడంతో గుండె జబ్బులు రావు.
 
4. తనువంతా పులకించేలా కౌగిలించుకుంటే ఇద్దరి చర్మాల రాపిడికి ఒకలాంటి విద్యుచ్ఛక్తి ఒకరి నుండి మరొకరికి ప్రవహించి నాడీ వ్యవస్థను ప్రభావిస్తుందట.
 
5. కౌగిలి ఓ థెరపీలా పనిచేస్తుందన్న విషయాన్ని మిచిగాన్ లోని కారోకి చెందిన డాక్టర్ రెవరెండ్ కెవిన్ జుబోర్ని గుర్తించి మొదటగా 1986లో జనవరి 21ని కౌగిలింతల దినోత్సవంగా రిజిస్టర్ చేశాడు. 
 
6. పెంపుడు జంతువులను దగ్గరకు తీసుకున్నా, లేదంటే మీకిష్టమైన సాప్ట్ టాయ్‌ని హత్తుకున్నా మంచిదే అంటున్నారు నిపుణులు. అందుకే మరి... కౌగిలి అనేకానేక వ్యాధులకు శక్తివంతమైన ఔషధంలా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments