Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిస్తా పప్పులు వారానికి ఎన్ని తీసుకోవాలో తెలుసా?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (19:28 IST)
సాధారణంగా మనం రకరకాల డ్రై ప్రూట్స్ తింటూ ఉంటాం. వాటిలో ముఖ్యమైనవి పిస్తాపప్పు. పిస్తాలో పోషక పదార్థం ఎక్కువ. పొటాషియం అత్యధికంగా లభిస్తుంది. శరీరములో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది. దీనిలో ఉండే బి 6 ప్రోటీన్ల తయారీ, శోషణములో ఉపయోగపడుతుంది. 
 
మిగిలిన ఎండు పండ్లతో పోలిస్తే పిస్తాలో కేలరీలు ఎక్కువ ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి. కేన్సర్ రాకుండా కాపాడతాయి. పిస్తాలో మోనో శాచ్యురేటెడ్ క్రొవ్వులు అధికంగా ఉన్నందున ఎక్కువగా తినకూడదు. వారంలో 15 - 20 గ్రాములు మించి తీసుకోకూడదు. రక్తంలో కొలెస్టిరాల్‌ను తగ్గిస్తాయి. అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లుగా ఉంటుంది. అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. పొట్టను పెరగనీయదు. దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. మిగతా నట్స్‌కన్నా ఎక్కువ ప్రోటీన్‌ శాతం ఉంది. ఇందులో ఫైబర్‌ కూడా ఎక్కువే. 
 
2. పిస్తాలో విటమిన్‌ బి6 సమృద్ధిగా ఉంటుంది. దీనిలో చర్మానికి మేలు చేసే విటమిన్‌ ఇ సమృద్ధిగా లభిస్తుంది.
 
3. క్రమంతప్పకుండా ఈ పిస్తాపప్పు తినడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
 
4. పిస్తాలో పొటాషియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం ఎక్కువుగా ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచే థియామిన్‌ పిస్తాలో ఎక్కువుగా ఉంటుంది.
 
5. కంటికి అత్యంత అవసరమైన 'ల్యూటిన్‌' మరియు 'జియాజాంథిన్‌' ఇందులో ఉండటం వలన కళ్లు ఎంతో తేజోవంతంగా కనిపిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments