Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ కాలంలో ఎక్కువవుతున్న లివర్ సమస్యలు, ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (16:32 IST)
ఇటీవలి కాలంలో కాలేయ సమస్యలు అధికమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. వ్యాయామం లేకుండా పోయింది. దీనికితోడు కాఫీ, టీలంటూ ఇతర తీపి పదార్థాలను ఎక్కువగా తినేస్తున్నారు. చ‌క్కెర లేదా తీపి అధికంగా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తినడం వ‌ల్ల కాలేయం దెబ్బ తింటుంది. చ‌క్కెరను అతిగా తింటే అది మొత్తం లివ‌ర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీంతో కొంత కాలానికి లివ‌ర్ ప‌నితీరు మంద‌గించి చెడిపోతుంది. 

 
ఆహార ప‌దార్థాల‌ు రుచిగా ఉండటానికి వాటిలో మోనోసోడియం గ్లుట‌మేట్ అనే ప‌దార్థాన్ని ఎక్కువ‌గా క‌లుపుతున్నారు. ఈ ప‌దార్థం ఉన్న ఆహారాన్ని తింటే, దీని ప్రభావం లివ‌ర్‌పై పడి చెడిపోతుంది. కూల్‌ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కూడా కాలేయం త్వరగా చెడిపోతుంది. కూల్‌‌డ్రింక్స్‌లో ఉండే రసాయన పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. 

 
ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం వల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే. చిప్స్‌‌లో ఉండే విష‌పూరిత‌మైన ప‌దార్థాలు లివ‌ర్ ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతాయి. కాబ‌ట్టి వాటికి కూడా దూరంగా ఉండ‌టం మంచిది. స్థూలకాయం ఉన్న‌వారు కూడా లివ‌ర్ ఆరోగ్యం ప‌ట్ల శ్రద్ధ వ‌హించాలి. శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతే ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది. 

 
డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి లివ‌ర్ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం 50 శాతం వ‌ర‌కు ఉంటుంది. క్రిమిసంహారక మందుల‌ను వాడి పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తింటే వాటితోపాటు ఆ మందులు కూడా మ‌న శ‌రీరంలోకి వెళ్తాయి. అప్పుడు ఆ మందులు లివ‌ర్‌పై ప్రభావం చూపుతాయి. మ‌ద్యపానం, ధూమపానం ఎక్కువగా చేసే వారిలో కూడా లివ‌ర్ త్వ‌ర‌గా చెడిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

తర్వాతి కథనం
Show comments