Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లాసుడు నిమ్మరసం తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు.. (video)

ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగకుండా.. ప్రతిరోజూ ఓ గ్లాసుడు నిమ్మరసం తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటిలో నాలుగు స్పూన్ల నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (18:33 IST)
ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగకుండా.. ప్రతిరోజూ ఓ గ్లాసుడు నిమ్మరసం తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటిలో నాలుగు స్పూన్ల నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే నిమ్మలో ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని టాక్సిన్స్‌ను నిర్మూలిస్తాయి. 
 
వేడి నిమ్మరసం ఖాళీ కడుపున త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మసాలా, జంక్ ఫుడ్ తీసుకుంటే ఉదయం నిమ్మరసం తాగడం వల్ల కడుపు ఉబ్బరం ఉండదు. అల్సర్లను దూరం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం మంచి ఔషదం లాంటిది. పొద్దున్నే ఒక గ్లాస్‌ నిమ్మరసం తాగడం వలన పొట్టలోని కొవ్వు కరిగిపోతుంది. 
 
నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. తద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు పలు బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి మనకు రక్షణను ఇస్తుంది. ప్రధానంగా జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటివి తగ్గిపోతాయి. 
 
ఇంకా పరుగడుపున నిమ్మరసం తాగడం ద్వారా వయస్సు మీద పడుతుండడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments