Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహానికి మందులు అక్కర్లేదట.. ఇలా చేస్తే చాలట..

ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు మన భారత దేశంలోనే వున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం వున్నట్లైతే ఇక మందులు వాడాల్సిందేనని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేస్తారు.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (18:03 IST)
ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు మన భారత దేశంలోనే వున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం వున్నట్లైతే ఇక మందులు వాడాల్సిందేనని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేస్తారు.

అయితే తాజాగా మధుమేహ వ్యాధిగ్రస్థులు (టైప్-2 డయాబెటిస్) మందులు వాడాల్సిన అవసరం లేదని సమతుల ఆహారంతోనే రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించుకోవచ్చునని న్యూ క్యాజిల్, గ్లౌస్ గౌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
సమతుల ఆహారంతో పాటు వ్యాయామం చేయడం, బరువు తగ్గడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ద లాన్ సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాల ద్వారా తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు బరువు తగ్గిన మధుమేహ వ్యాధిగ్రస్థులు సగం మంది మందులు వాడటాన్ని నిలిపేశారు. వారు కేలరీలు తక్కువ కలిగిన ఆహారాన్ని తీసుకున్నారు. తద్వారా బరువు తగ్గారు. దీంతో 45శాతం మంది రోగులు మందులు వాడాల్సిన అవసరం తప్పిందని పరిశోధకులు రాయ్ టేటర్, మైక్ లీన్‌లు తెలిపారు.  
 
బ‌రువు త‌గ్గ‌డం వ‌ల్ల ఇన్సులిన్‌ను విడుద‌ల చేసే పాంక్రియాస్ గ్రంథిలో కొవ్వు నిల్వ‌లు క‌రిగిపోతాయ‌ని, త‌త్ఫ‌లింగా మ‌రింత ఎక్కువ ఇన్సులిన్‌ను విడుద‌ల చేసే సామ‌ర్థ్యాన్ని పాంక్రియాస్ సంత‌రించుకుంటుంద‌ని పరిశోధకులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments