Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాద మర్దనం... ఎన్ని ఫలితాలో తెలుసా?

శరీరంలో జరిగే క్రియలకు, అరికాళ్లకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి రోజు అరికాళ్లను మసాజ్ చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడులను అధికమించవచ్చు. మసాజ్ చేసుకునే ముందు అరికాళ్లను ముంద

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (15:42 IST)
శరీరంలో జరిగే క్రియలకు, అరికాళ్లకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి రోజు అరికాళ్లను మసాజ్ చేసుకోవడం ద్వారా ఈ ఒత్తిడులను అధికమించవచ్చు. మసాజ్ చేసుకునే ముందు అరికాళ్లను ముందుగా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నాలుగైదు చుక్కల నూనెతో మెల్లగా మర్దన చేయాలి. రెండుమూడు వేళ్లతో కండరాల మీద ఒత్తిడి చేస్తూ మసాజ్‌ మొదలెడితే మంచిది. వీలైనంతవరకు బొటన వేలితో ఒత్తిడిని పెంచాలి. ఈ మసాజ్‌ వల్ల శరీరంలో అనుకోని మార్పులు జరిగి సత్వరమే రిలాక్సేషన్‌ లభిస్తుంది. శరీరంలోకి కొత్త శక్తి వచ్చి చేరుతుంది. ఈ మసాజ్ వల్ల కండరాల్లో అక్కడక్కడ ఏర్పడిన బ్లాకేజీలు తొలగి, రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శక్తి శరీరమంతా వ్యాపిస్తుంది.
 
దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బిగుతుగా ఉండే సాక్సులు, షూస్‌ వేసుకోవడం వల్ల అరికాళ్లకు గాలి తగలదు. ఒట్టి కాళ్లతో నేల మీద నడిచేందుకు వీలుండదు. తద్వార రక్తప్రసరణ సరిగా సాగదు. కాబట్టి షూష్‌ ఎక్కువగా వేసుకునే వాళ్లు  వారానికి మూడుసార్లు అయినా కాళ్లను మసాజ్‌ చేయించుకుంటే మంచిది అని నిపుణులు చెపుతున్నారు. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగితే ఎన్నో దీర్ఘకాలిక జబ్బులు దరి చేరవు. 
 
మహిళలు గర్భం దాల్చినప్పుడు కాళ్ల వాపులు సహజం. ఎక్కువ దూరం నడవకపోవడం వల్ల కాళ్ల నొప్పులు మొదలవుతాయి. వాపులు ఎక్కువయ్యే కొద్దీ ఇతరత్రా సమస్యలు వస్తాయి. ఇటువంటి వాళ్లు రోజూ పడుకునేప్పుడు పదిహేను నిమిషాల పాటు అరికాళ్లకు మసాజ్‌లు చేయించుకుంటే ఉత్తమం. డిప్రెషన్‌, యాంగ్జయిటీ, స్ట్రెస్.... ఇవన్నీ మెల్లగా మనిషి ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే జబ్బులు. వీటిని తగ్గించుకోవటానికి రిలాక్సేషన్‌ టెక్నిక్‌లు అనుసరించాలి. ఈ టెక్నిక్స్‌లో అద్భుత ఫలితాలనిస్తుంది ఫుట్‌ మసాజ్‌. దీనివల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత లభిస్తుంది.
 
మెనోపాజ్‌, పిఎంఎస్‌ సమస్యలు అనేకం. ఉన్నట్లుండి మూడ్‌ మారిపోవడం, చికాకు, కోపం, తలనొప్పి, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి ఇవన్నీ పట్టుకుంటాయి. ఈ సమస్యలతో బాధపడేవాళ్లు.. ఫుట్‌ మసాజ్‌ను ఆశ్రయించొచ్చు. రోజూ చేసుకుంటే సమస్యలు కొంత వరకు తగ్గుతాయనడంలో సందేహం లేదు. ఆఫీసులో పని ఒత్తిడి, లక్ష్యాల వల్ల ఆందోళన, ఒత్తిడి కలుగుతుంటుంది. వేళకు తినకపోవడం, జంక్‌ఫుడ్‌ను ఆశ్రయించడం, జీర్ణశక్తి తగ్గడం వంటి అనేక రకాల సమస్యల వల్ల అధిక రక్తపోటు వస్తుంది. రోజుకు కనీసం పది నిమిషాల పాటు ఫుట్‌ మసాజ్‌ చేసుకుంటే అధిక రక్తపోటు ద్వారా వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

తర్వాతి కథనం
Show comments