Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాజికాయతో పెరిగే లైంగిక సామర్థ్యం (video)

జాజి ఆకుల రసానికి సమంగా నువ్వుల నూనెను కలిపి సన్నని సెగపై ఇగిరే దాకా కాచి.. తైలంలా తయారయ్యాక చెవిలో వేస్తే.. చెవిలోని ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేదం చెప్తుంది. జాజి ఆకులను కషాయంతో కడిగితే

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (10:32 IST)
జాజి ఆకుల రసానికి సమంగా నువ్వుల నూనెను కలిపి సన్నని సెగపై ఇగిరే దాకా కాచి.. తైలంలా తయారయ్యాక చెవిలో వేస్తే.. చెవిలోని ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేదం చెప్తుంది. జాజి ఆకులను కషాయంతో కడిగితే చర్మ సంబంధిత వ్యాధులు త్వరితంగా మానిపోతాయి.

జాజి ఆకుల రసాన్ని పగిలిన కాళ్లకు ప్రతి రోజూ పట్టిస్తే, పగుళ్లు మానడంతో పాటు పాదాలు మృదువుగా మారతాయి. జాజి ఆకులను నమిలి మింగుతూ ఉంటే నోటి అల్సర్లకు చెక్ పెట్టవచ్చు.  తాజా జాజి పూలను మెత్తగా రుబ్బి, ప్రతి రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం క్రమక్రమంగా కాంతివంతంగా తయారవుతుంది.
 
జాజి పూల యుక్తంగా కొమ్మలను ముక్కలుగా కత్తిరించి ఆరలీటర్‌ నీటిలో వేసి, పావులీటరు మిగిలేదాకా కాచి, ఆ తర్వాత వడబోయాలి. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం తయారు చేసుకుని సేవిస్తే, రుతుక్రమం చక్కబడుతుంది. సంతానప్రాప్తి చేకూరుతుంది.
 
జాజికాయలో కామెర్ల వ్యాధిని తగ్గించే స్వభావం ఉంది. గుండె నొప్పిని తొలగించి బీపీని నియంత్రిస్తుంది. జాజికాయ, శొంఠి అరగదీసి కణతలకు పట్టువేస్తే తలనొప్పి, మైగ్రేన్‌ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
మంచి నిద్రకోసం జాజికాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చెంచా తేనెను చిటికెడు జాజికాయ పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు తాగండి. బాగా నిద్రపడుతుంది. జాజికాయ వీర్యవృద్ధికి తోడ్పడుతుందంట. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది. అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం