Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టాలా? బరువు తగ్గాలా? ఐతే ఉల్లిపాయల్ని?

కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టాలా? బరువు తగ్గాలా? అయితే ఉల్లిపాయల్ని అధికంగా ఆహారంలో చేర్చుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. కీళ్లు అరిగిపోవడం.. బరువు పెరిగిపోవడానికి ఉల్లి ఎంతో మేలు చేస్తుంది. అలాగే గు

Webdunia
గురువారం, 24 మే 2018 (09:37 IST)
కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టాలా? బరువు తగ్గాలా? అయితే ఉల్లిపాయల్ని అధికంగా ఆహారంలో చేర్చుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. కీళ్లు అరిగిపోవడం.. బరువు పెరిగిపోవడానికి ఉల్లి ఎంతో మేలు చేస్తుంది. అలాగే గుండె నొప్పికి కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు, ఉల్లి, ట్రైగ్లిజరైడ్లను పెరగకుండా కూడా చేస్తుంది. 
 
ఉల్లిపాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు గుండెజబ్బుల్ని నివారిస్తుంది. స్త్రీలలో మెనోపాజ్‌కు ముందు ఎముకలు సాంధ్రత కోల్పోయి, క్రమక్రమంగా అరిగిపోతాయి. ఆ సమయంలో తరుచూ ఉల్లిపాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటే, ఆ సమస్య రాకుండానే నిరోధించవచ్చు. ఒకవేళ అప్పటికే ఆ సమస్య మొదలై ఉంటే, ఉల్లి వాడకం ద్వారా సమస్య అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఉల్లిపాయల్లో క్వర్సెటిన్ ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయల్లోని అలిసిన్ బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించి, నాశనం చేస్తుంది. ఉల్లిపాయల్లో పీచు పదార్థం ఉంటుంది, దీని వలన ఆరోగ్యవంతమైన జీర్ణవ్యవస్థ సాధ్యమవుతుంది.
 
కడుపు ఉబ్బరం,  అజీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఉల్లిపాయలను తినడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. కనుక డయాబెటీస్‌ పేషెంట్లు పరిమితంగా ఉల్లిపాయల్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

తర్వాతి కథనం
Show comments