Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు పైనాపిల్ బెస్ట్.. ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:19 IST)
ప్రకృతి ప్రసాదించిన అనేక పండ్లలో పైనాపిల్ ఒకటి. దీనిలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. పుల్లపుల్లగా తీయతీయగా ఉండే వీటిల్లో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో జీరో ఫ్యాట్, జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది, పుష్కలంగా విటమిన్ ఏ, బి, సీ, పొటాషియం, మాంగనీస్, కాపర్ ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే రోజు మెుత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్లే. దీనితో రోగ నిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది. పైనాపిల్‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
పైనాపిల్‌లో కణజాలం వృద్ధి చెందటానికి, కణాల మరమ్మత్తుకు అవసరమయ్యే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం రాకుండా, క్యాన్సర్, గుండె జబ్బువంటి జబ్బులు దరిచేరకుండా చూస్తాయి. అంతేకాకుండా పైనాపిల్ బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. సంతానం కోరుకునే జంట రెగ్యులర్‌గా పైనాపిల్స్ తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. 
 
విటమిన్ సీ, బీటా కెరోటిన్, కాపర్, మినరల్స్ సంతానోత్పత్తికి తోడ్పడతాయి. పైనాపిల్ తినటం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి ఎక్కువ తినకుండా చూస్తుంది. అలాగే మలబద్దకం దరి చేరకుండా చేస్తుంది. సైనస్, అలర్జీలతో బాధపడే వాళ్లకు పైనాపిల్ చక్కటి పరిష్కారం. 
 
ఇందులో ఉండే పోషకాలు గొంతు, ముక్కులో ఉండే శ్లేష్మంను అరికడుతుంది. ఒకవేళ సీజనల్ అలర్జీలు ఉంటే పైనాపిల్స్‌ని డైట్లో చేర్చుకోవచ్చు. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. కాబట్టి ఎప్పుడైనా జలుబు, దగ్గు వచ్చాయంటే ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగితే వెంటనే రిలాక్స్ అయిపోతారు. 
 
మొటిమలతో బాధపడుతున్నప్పుడు పైనాపిల్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్స్‌తో పాటు ఎంజైమ్స్ ఉండటం వల్ల జ్యూస్‌లాగా తీసుకున్నా మంచిదే, ఫేస్ ప్యాక్‌లా వేసుకున్నా మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా పసుపు తీసుకుని పైనాపిల్ పేస్టులో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments