కోపం వస్తే.. కాస్త ఎందుకో ఆలోచించండి..

Webdunia
బుధవారం, 22 మే 2019 (17:34 IST)
ప్రతి చిన్న విషయానికి మీకు కొపం వస్తుంటే దానికి కారణం ఏమిటని మీరు ఆలోచించారా? చాలా మంది చేసే పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, చిరాకు పడటం, విసుగు చెందడం జరుగుతుంటుంది. నిద్రలేమితో బాధపడే వారిలో ఈ లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోతే దాని ప్రభావం మన ఆరోగ్యంపై బాగా పడుతుంది. 
 
నిద్రలేమితో బాధపడేవారు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా ఒక నిరాశపూరిత వాతావరణంలో వారు ఉంటారట. సాధారణంగా అలసిపోయిన వారిలో చికాకు కనిపిస్తుంది. 
 
అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందని, అకారణంగా ఎదుట వారిపై విరుచుకుపడతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మేరకు కొందరిని ఎంపిక చేసి రెండ్రోజులపాటు వారు ఎంతసేపు నిద్రపోవాలో చెప్పి చూశారు.

కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే, నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు, కోపం కనిపించాయని తెలిపారు. అందుకే కంటినిండా నిద్రపోవాలి. దానితోపాటు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో భారీ వర్షాలు...గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు

ముంబైలో ఆరెంజ్ అలర్ట్ జారీ.. స్కూల్స్, కాలేజీలు మూసివేత (video)

వీడియో కాల్‌ చేసి.. లైవ్‌లో రైలు కింద పడి ఆత్మహత్య

వాటర్ బిల్లు కట్టలేదని బెదిరించారు.. రూ. 4.19 లక్షలు పోగొట్టుకున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి

బాలిక నోట్లో పెన్ క్యాప్ పెట్టి నీళ్లు పోసిన సాటి విద్యార్థినిలు... తర్వాత ఏం జరిగింది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagabandham collections :నాగబంధం కలెక్షన్స్ కు దర్శక నిర్మాతలు తిప్పలు !

Ntr: అఖిల్ అక్కినేని రీఎంట్రీకి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్

రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, ఒక్క మంచి పనైనా చేసావా?: ప్రకాష్ రాజ్ పైన బండ్ల పంచ్‌లు

రామాయణంలో శ్రీరాముడి తొలి లుక్‌కు వెనుక ఉన్న ఆభరణాలను ఆవిష్కరించిన ట్రైబ్ అమ్రపాలి

'ప్రశ్న' రావణ్ మొబైల్ ఫోనులో మావోయిస్టులను కీర్తిస్తూ ప్రసంగాలు

తర్వాతి కథనం
Show comments