Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించే చింత గింజలు.. అవునా?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (18:06 IST)
సాధారణంగా చింతపండును తీసి చింతగింజలని పడేస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఈ చింతగింజల బెనిఫిట్స్ గురించి తెలియదు. చింత గింజల వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే మరి ఎలాంటి అనారోగ్య సమస్యల నుండి చింత గింజలతో బయటపడవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
 
'పళ్ళు శుభ్రంగా ఉంటాయి":
చింత గింజల పొడితో పళ్లు తోముకోవడం వల్ల పళ్ళు అందంగా తెల్లగా ఉంటాయి. ముఖ్యంగా స్మోక్ చేసేవాళ్లు మరియు ఎక్కువ డ్రింక్స్ తాగే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు బ్రష్ చేసేటప్పుడు టూత్ పేస్ట్‌తో పాటు చింతగింజల పొడి కూడా వేసుకొని బ్రష్ చేస్తే పళ్ళు అందంగా మెరుస్తూ ఉంటాయి.
 
"అజీర్తి సమస్యలు": 
జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళకి చింత గింజలు బాగా ఉపయోగపడతాయి. చింత గింజల రసం తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు పోతాయి. అలానే ఈ జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి.
 
 
"ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది":
 వీటిలో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతే కాదండీ చింతగింజలు యూరినరీ ట్రాక్ట్ లో సమస్యలు లేకుండ చూసుకుంటాయి.
 
"డయాబెటిస్ రిస్కు తగ్గుతుంది": 
చింతగింజల పొడి లో నీళ్ళు కలుపుకుని తాగడం వల్ల డయాబెటిస్ తగ్గుతుంది. ఎక్కువమంది డయాబెటిస్‌తో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకు ఇది నిజంగా ఉపశమనాన్ని ఇస్తుంది.
 
"హృదయ సమస్యలు":
చింత గింజలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది దీంతో ఇది హృదయ సంబంధిత సమస్యలు కూడా చెక్ పెడుతుంది. ఇలా ఈ విధంగా చింత గింజలతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

తర్వాతి కథనం
Show comments