Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుచిగా వుండే మినరల్ వాటర్ తాగుతున్నారా? కాస్త ఆగండి..

బోర్‌వెల్ నుంచి వచ్చే వాటర్ తాగకుండా.. మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? ఈ నీటిలోని మినరల్స్‌ను ఆర్వో వాటర్ కంపెనీలు జీరో చేసేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం తాగునీటిలో 100 పీపీఎం ఉం

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (11:34 IST)
బోర్‌వెల్ నుంచి వచ్చే వాటర్ తాగకుండా.. మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? ఈ నీటిలోని మినరల్స్‌ను ఆర్వో వాటర్ కంపెనీలు జీరో చేసేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం తాగునీటిలో 100 పీపీఎం ఉండాలి. కానీ మనకు బయట దొరికే వాటర్ బాటిళ్లలో పది నుంచి ఇరవై పీపీఎం మాత్రమే ఉంటోంది. ఇలాంటి నీళ్లు ఆరోగ్యానికి హానికరమని.. ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా శుద్ధిచేసిన నీటిని తాగితే.. కడుపులో ఎసిడిటీ, ఉబ్బరం.. ఇతర జబ్బులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సంస్థలు నీళ్లను కూడా ఫిల్టర్ చేసేందుకు అందులో పొటాషియం కలుపుతున్నాయి. ఈ నీళ్లు రుచిగా వుంటాయి. అయితే జబ్బులు మాత్రం తప్పవు. 
 
అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీటిని సేవించడం ద్వారా క్యాన్సర్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల వాటర్ బాటిల్స్ పెట్ (పాలిథ్లిన్ టెరెఫ్తట్లేట్)‌తో  తయారవుతున్నాయి. ఈ పెట్ క్యాన్సర్‌కు కారకమవుతుంది. ఈ బాటిల్స్‌ను ఎండలో వుంచితే రసాయనాలు కరిగి నీటిలో కలుస్తాయి. ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. 
 
అంతేకాకుండా ఆఫీసుల్లో వాడే కూలర్ బాటిల్స్‌‌, వాటర్ ఫిల్టర్లలో ఉండే బీపీఏ (బిస్పెనాల్-ఎ) కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్, ఓవరీన్, లివర్ క్యాన్సర్ తప్పవని.. వీటితో పాటు మెదడు సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, ఒబిసిటీ వచ్చే అవకాశాలున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments