ప్రతిరోజూ టమోటాను ప్యాక్‌లా వేసుకుంటే..?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (19:02 IST)
Tomato face pack benefits
ప్రతిరోజూ టమోటాను ఉపయోగిస్తే ఆయిలీ ఫేస్ వున్న వారికి మంచి ఫలితం వుంటుంది. మొటిమలను ఇది దూరం చేస్తుంది. ఆయిలీ ఫేస్‌కు చెక్ పెట్టాలంటే.. రోజూ టమోటాను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. తద్వారా చర్మం కాంతివంతం అవుతుంది. సాయంత్రం పూట టమోటా జ్యూస్ ఒక స్పూన్, లెమన్ జ్యూస్ ఒక స్పూన్ చేర్చి.. ఆ మిశ్రమంతో ముఖాన్ని వాష్ చేస్తే చర్మం మెరిసిపోతుంది. 
 
శనగపిండిని టమాట గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ప్రభావం కనిపిస్తుంది. టమాటాల గుజ్జుని పాలతో కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.
 
టమోటా జ్యూస్ రెండు స్పూన్లు, పెరుగు కాసింత, తేనె, నిమ్మరసం చెరో స్పూన్ చేర్చి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే.. మంచి ఫలితం వుంటుంది. ఇలా వారానికి ఓసారి చేస్తే చర్మకాంతి పెంపొందుతుంది. మొటిమలు తొలగిపోతాయి. రోజూ టమోటాతో ముఖానికి మసాజ్ చేస్తే చర్మం మృదువుగా తయారవుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

కడుపు నొప్పి అంటూ ఆస్పత్రికి వచ్చి వైద్యులపై దాడి చేసిన మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments