Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున ఇలాంటి పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (15:24 IST)
ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకని అమితంగా తినడం అంత మంచిది కాదు. ఒకవేళ ఎక్కువైతే మన శరీరానికి అదే విషమవుతుంది. ఈ క్రమంలో ఉదయాన్నే ఇతర ఆహారాలు తీసుకుంటే కలిగే నష్టాలు ఓసారి తెలుసుకుందాం..
 
1. కొందరైతే పరగడుపున పుల్లటి ఆహారాలు తీసుకుంటారు. ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తింటే జీర్ణవ్యవస్థ పనితీరు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా వేరే పదార్థం తీసుకున్న తరువాతే పుల్లటి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
2. పరగడుపున పండ్లు తినడం మంచిదని ఇటీవలే చాలామంది జోరుగు ప్రచారం చేస్తున్నారు. కానీ అది నిజం కాదని.. వెల్లడించారు నిపుణులు. ముఖ్యంగా అరటిపండు ఉదయాన్నే పరగడుపున తీసుకోరాదు. అరటిపండులో మెగ్నిషియం అధిక మోతాదులో ఉంటుంది. శరీరానికి ఉదయాన్నే ఎక్కువ మోతాదులో మెగ్నిషియం అందడం మంచిది కాదు.
 
3. పరగడుపున శీతల పానీయాలు తాగడం వలన జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలైయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆమ్లం కారణంగా వికారం, వాంతులు వంటి సమస్యలకు గురవుతారు. కనుక.. ఖాళీ కడుపుతో ఏ పదార్థాన్నైనా తినేముందు కాస్త జాగ్రత్త వహించండి.
 
4. పరగడుపున కాఫీ, టీ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే.. హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయని వారు చెప్తున్నారు. కాబట్టి ఒక గ్లాస్ మంచి నీటిని మాత్రం ఉదయాన్నే తీసుకోండి. ఆ తర్వాత మిగిలినవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments