సరైన ఆహార నియమాలను అనుసరించి వ్యాయామం చేస్తూ ఉండటం ద్వారా అధిక బరువు తగ్గించుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన మార్గం కూడా. అయితే తీరిక లేని వారు లేదా బద్దకస్తులు ఇవి పాటించకుండా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా రసాయనిక మందులు తీసుకుంటారు. ఇది చాలా హానికరం. అనేక దుష్ప్రభావాలు కూడా తలెత్తుతాయి. బరువు తగ్గించే మాత్రలను వాడటం వలన కలిగే సాధారణ సమస్య జీర్ణాశయ సమస్య. ...