Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులకు అవి పెరగాలంటే మందారం, నువ్వులు, టమోటాలు

దంపతులలో భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థలు సరిగా పనిచేసినప్పుడే సంతానం త్వరగా కలిగే అవకాశం ఉంటుంది. అయితే స్త్రీల మాట అటుంచితే ప్రధానంగా పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉన్నప్పుడే సంతానం కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. వీర్య

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (17:51 IST)
దంపతులలో భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థలు సరిగా పనిచేసినప్పుడే సంతానం త్వరగా కలిగే అవకాశం ఉంటుంది. అయితే స్త్రీల మాట అటుంచితే ప్రధానంగా పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉన్నప్పుడే సంతానం కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. వీర్యంలో శుక్రకణాలు ఏ మాత్రం యాక్టివ్‌గా లేకపోయినా, లేదంటే ఉండాల్సిన సంఖ్య కన్నా శుక్రకణాలు తక్కువగా ఉన్నా దాంతో సంతాన సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు వారు సరైన సూచనలు పాటించి సంతానం పొందవచ్చు. అవేంటంటే...
 
1. మనం తినే ఆహారాన్ని ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకూడదట. వాటిల్లో పెట్టినవి మగవారు తినడం వల్ల వీర్యం నాణ్యత తగ్గిపోతుందట. 
 
2. చికెన్, మటన్ వంటి మాంసం కన్నా చేపలు ఎక్కువగా తినే వారిలోనే వీర్యం నాణ్యంగా ఉంటుంది. దాంతో పాటు శుక్ర కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
 
3. వ్యాయామం చేయని వారిలో వీర్యం సరిగా ఉండదు. నిత్యం గంట పాటు వ్యాయామం చేసే వారిలో వీర్యం నాణ్యంగా ఉండి శుక్రకణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా శుక్రకణాలు బాగా యాక్టివ్‌గా ఉంటాయి.
 
4. టమోటాలో ఉండే లైకోఫిన్ వీర్యం మీద ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. టమోటాలు ఎక్కువగా తినే వారిలో వీర్యకణాల నాణ్యత పెరుగుతుందట.
 
5. మందారాలను బాగా ఎండబెట్టి మెత్తని పొడిలా చేయాలి. ఈ పొడి ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. వీర్య కణాల సమస్యతో బాధపడేవారు ఈ మందార పొడిని రెండు స్పూన్లు నోట్లో వేసుకుని గ్లాసు పాలు తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా నలబై రోజుల పాటు తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరిగి ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందవచ్చు.
 
6. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో రెండుసార్లు గుప్పెడు నువ్వులను తినడం వల్ల వీర్యంలో శుక్రకణాల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments