Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజీరతో మగాళ్లకు అదరగొట్టే శక్తి....

మనం ప్రతి రోజు రకరకాల పండ్లు, కూరగాయలు తింటూ ఉంటాం. వీటిలో ఒక్కో దాని వల్ల ఒక్కొక్క ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. కాని అంజీర పండ్లలో మాత్రం ఎక్కువ ఔషధ గుణాలు, ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.దీనిని అత్తిపండు అని కూడా పిలుస్తారు. అంజీరలో విటమిన్ ఎ, బి6, సిలతో పా

Webdunia
బుధవారం, 25 జులై 2018 (21:36 IST)
మనం ప్రతి రోజు రకరకాల పండ్లు, కూరగాయలు తింటూ ఉంటాం. వీటిలో ఒక్కో దాని వల్ల ఒక్కొక్క ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. కాని అంజీర పండ్లలో మాత్రం ఎక్కువ ఔషధ గుణాలు, ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.దీనిని అత్తిపండు అని కూడా పిలుస్తారు. అంజీరలో విటమిన్ ఎ, బి6, సిలతో పాటు పొటాషియం, మాంగనీస్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, పైబర్, క్యాలరీస్, ప్రోటీన్స్ కార్బోహైడ్రేడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్రమంతప్పకుండా అంజీరను తీసుకోవటం వలన శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. అంజీరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవాళ్లు అంజీరను డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే పైబర్ తీసుకున్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేయడంతో పాటు మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.
 
2. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
 
3. లైంగిక సామర్ధ్యాన్ని రెట్టింపు చేయడంలో అంజీర కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో ఉండే మోగ్నీషియం, జింక్, క్యాల్షియం బలహీనతను పోగొట్టి దాంపత్య జీవితం సుఖంగా సాగేందుకు దోహదపడుతుంది.
 
4. అంజీరలో ఒమోగా3 ప్యాటీ ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. ఇది చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌‌ను పెంచుతుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది.
 
5. అంజీర శరీరంలోని ఇన్సులిన్ను క్రమబద్దీకరిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం చక్కెర నిల్వను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది. అంజీరను షుగరువ్యాధిగ్రస్తులకు చక్కటి వరం అని చెప్పవచ్చు.
 
6. అంజీరలో ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా ఉంచుతుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా అంజీరను తినడం వలన పెళుసుగా మారిన ఎముకలు పుష్టిగా తయారవుతాయి. ఇందులో ఉండే పైబర్ ప్రేగులో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
 
7. అంజీర పండు పురుషలలో శృంగారేఛ్చను రెట్టింపు చేయడంతో పాటు సంతానలేమి సమస్యను దూరం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం