Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతిలో వేయించిన జీలకర్ర చూర్ణంలో తగినంత ఉప్పు కలిపి...

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనేది మరిచిపోలేని వాస్తవం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టేమన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మన పరిసరాలు, వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, మానసిక ప్రశాంతత, నీరు, పీల్చే గాలి లాంటి ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (21:23 IST)
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనేది మరిచిపోలేని వాస్తవం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టేమన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా  మన పరిసరాలు, వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, మానసిక ప్రశాంతత, నీరు, పీల్చే గాలి లాంటి ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావాన్ని చూపిస్తాయి. ఆహార పదార్థాల, వంటకాల తయారీలో నిత్యం రంగు, రుచి, వాసన కోసం వాడే వివిధ సుగంధ ద్రవ్యాలు, దినుసులు చాలా వ్యాధులను రాకుండా నిరోధించడంతో పాటు వచ్చిన వ్యాధులను త్వరగా రూపుమాపేందుకు తోడ్పడుతాయి. అలాంటి వాటిలో జీలకర్ర ముఖ్యమైనది. జీలకర్ర వల్ల మన ఆరోగ్యానికి జరిగే మేలేంటో తెలుసుకుందాం.
 
1. జీలకర్రలో మంచి ఔషధ గుణాలున్నాయి. దీనిలో శరీరానికి అవసరమయ్యే మాంసకృత్తులు, పిండి, కొవ్వుపదార్థాలు, ఐరన్, క్యాల్షియం, ఇతర విటమిన్లు, సువాసన కల్గించే తైలాలు ఉన్నాయి.
 
2. జీలకర్ర, ఉప్పు, తేనె, నెయ్యి సమపాళ్లలో కలిపి నూరి తేలు, కందిరీగ, తేనెటీగ లాంటి కీటకాలు కుట్టినప్పుడు ఆయా భాగాలపై పట్టిస్తే మంట, నొప్పి, బాధ, దురద త్వరితంగా తగ్గుతాయి.
 
3. జీలకర్ర పొడి, బెల్లం సమానంగా కలిపి నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసి రోజూ మూడు పూటలూ తీసుకుంటుంటే జ్వరాలు, పైత్యం వల్ల వచ్చే దద్దుర్లు, దురద తగ్గుతాయి. జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. ఈ మాత్రలను పాలతో తీసుకుంటే మగవారిలో వీర్యం వృద్ది అవుతుంది.
 
4. చిగుళ్లవాపు, నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటి బాధలు ఉన్నప్పుడు జీలకర్ర పొడి, ఉప్పు, కరక్కాయ పొడి సమానంగా కలిపి చేసిన పళ్లపొడితో రోజూ పళ్లు తోముకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
5. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ పడుకునే ముందు ఒక స్పూన్ జీలకర్ర పొడిని అరటి పండులో కలుపుకుని తింటే బాగా నిద్ర పడుతుంది.
 
6. నేతిలో వేయించిన జీలకర్ర చూర్ణంలో తగినంత ఉప్పు కలిపి రెండు పూటలా తీసుకుంటే ఆడవారిలో బహిష్టు సమయంలో వచ్చే నొప్పి తగ్గి ఋతుక్రమం సక్రమంగా అవుతుంది. గర్బాశయ దోషాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments