Daily Horoscope
✕

బేకింగ్ సోడా, నిమ్మరసంతో అందమైన దంతాలు..

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:45 IST)
ముఖానికి చిరునవ్వు అందం. మనం నవ్వేటప్పుడు పళ్లు కూడా అందంగా కనిపించాలి. పాచి లేదా గార కనిపిస్తే మనకే సిగ్గు అనిపిస్తుంది. చాలా మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పళ్లపై వచ్చే నల్ల గారను పోగొట్టుకోలేరు. ఎన్నో టూత్ పేస్ట్‌లు, బ్రష్‌లు ఉపయోగించినా ప్రయోజనం ఉండదు. అంగట్లో దొరికే పదార్థాలకు బదులుగా మనం ఇంట్లోనే దానికి పరిష్కారం వెతుక్కోవచ్చు. 
 
బేకింగ్ సోడా, నిమ్మరసం ఉపయోగించి తెల్లని పళ్లను మన సొంతం చేసుకోవచ్చు. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో సగం చెక్క నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని బ్రష్ చేస్తున్నట్లుగా వేలితో పళ్లపై నెమ్మదిగా రుద్దాలి. ఇలా మూడు నిమిషాలు చేసి నీటితో పుక్కిలించితే మీ పళ్లు తలతలా మెరిసిపోతాయి.
 
పిడికెడు తులసి ఆకులను నీడలో ఆరబెట్టి పొడిచేసి దానిని పళ్లకు రుద్దుకున్నా కూడా పచ్చటిగార పోయి దంతాలు మెరుస్తాయి. రోజూ ఉపయోగించే పేస్ట్‌కి తులసి పొడిని జోడించి పళ్లకు రుద్దినా ప్రయోజనం ఉంటుంది. ఉప్పులో నిమ్మరసం పిండి పళ్లు తోముకున్నా పచ్చదనం పోతుంది. లవంగాల పొడిని పేస్ట్‌లో కలిపి బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. పళ్లు పుచ్చిపోకుండా దృఢంగా కూడా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంబటి రాంబాబు, వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలపై కేసు నమోదు

నేపాల్‌లో ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు - భారతీయుడి దుర్మరణం (Video)

Raptadu: రాప్తాడు నిందితుడి కాలు తొలగించారు..

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు : ఆధిక్యంలో కూటమి నేతలు

జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో టీడీపీ, వైకాపాకు రెండో స్థానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.5 కోట్లు ఇస్తావా.. చస్తావా? బాలీవుడ్ నటుడుకి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు

Suriya: సీన్ చిత్రంలో మిస్టరీ, మ్యాడ్‌నెస్, నవ్వులు అన్నీ ఉంటాయి : హీరో సూర్య

Mahesh Babu in Shotgun games: ప్రాజెక్ట్ టేక్‌డౌన్ కోసం షార్ట్‌గన్ గేమ్స్‌లో మహేష్ బాబు పెట్టుబడి

Poonam Kaur: త్రివిక్రమ్‌ను నకిలీ గురువు అంటూ ఏకేసిన పూనమ్ కౌర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయాలని కోరిన మెగాస్టార్ చిరంజీవి

తర్వాతి కథనం
Show comments