Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఖర్బూజా పండును తింటే...?

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (21:37 IST)
వేసవిలో మనకు అధికంగా దొరికే పండు ఖర్బూజ పండు. ఈ పండులో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ ఖర్బూజ పండులో దాదాపు తొంబై శాతం నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. మరి ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. 
 
1. ఖర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గించి ప్రీ-రాడికల్స్‌ని తొలగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
 
2. ఖర్బూజ పండులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటిచూపు బాగా ఉండేలా చేస్తుంది.. వడదెబ్బ నుండి రక్షిస్తుంది.
 
3. ఖర్బూజ పండులో విటమిన్ కె మరియు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా జరిగేలా ఉపయోగపడుతుంది.
 
4. ఖర్బూజ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన గుండెకు మంచి న్యూట్రియన్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండటం వలన అది హార్ట్ ఎటాక్ నుండి మరియు గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.
 
5. ఖర్బూజలో తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది. 
 
6. ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.
 
7. ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్దిగా ఉండడం వలన గర్బిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది.
 
8. కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్‌ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

IMD: ఏప్రిల్ 26 వరకు హీట్ వేవ్ అలర్ట్ జారీ- 44 డిగ్రీల కంటే పెరిగే ఉష్ణోగ్రతలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

తర్వాతి కథనం
Show comments