Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట.. ఫుల్‌గా లాగిస్తే.. ఒబిసిటీ తప్పదు..

ఉదయం, మధ్యాహ్నం తక్కువగా భోజనం తీసుకుని.. రాత్రిపూట ఫుల్‌గా లాగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఉదయం భోజనం అధికంగా.. మధ్యాహ్నం మామూలుగా.. రాత్రి పూట స్వల్పంగా తీసుకోవడం చేస్తే ఆరోగ్యా

Webdunia
సోమవారం, 10 జులై 2017 (11:21 IST)
ఉదయం, మధ్యాహ్నం తక్కువగా భోజనం తీసుకుని.. రాత్రిపూట ఫుల్‌గా లాగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఉదయం భోజనం అధికంగా.. మధ్యాహ్నం మామూలుగా.. రాత్రి పూట స్వల్పంగా తీసుకోవడం చేస్తే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అలా కాకుండా ఉదయం, మధ్యాహ్నం ఏదో కొంత తీసుకుని.. రాత్రి పూట ఎక్కువగా తీసుకుంటే స్థూలకాయం తప్పదని.. తద్వారా అనారోగ్యాలు సైతం తప్పవంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.  
 
జీర్ణక్రియ మందగించే రాత్రివేళ ఆహారం అతిగా తీసుకోవడం వల్ల పేగులు, లివర్‌, క్లోమగ్రంథి కూడా అధికంగా పనిచేయవలసి వస్తుంది. దీనివల్ల దేహక్రియలన్నీ కుంటుపడే మెటబాలిక్‌ సిండ్రోమ్‌ సమస్య కూడా తలెత్తుతుంది. ఇంకా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వులో ఇన్సులిన్‌ను పనిచేయకుండా చేసే యాంటీ- ఇన్సులిన్‌ హార్మోన్లు ఉంటాయి. దీనివల్ల ఇన్సులిన్‌ అవసరం మరింత పెరిగిపోతుంది. క్రమంగా ఇది మధుమేహానికి దారి తీస్తుంది. 
 
ఈ కొవ్వు నిలువల వల్ల స్థూలకాయం, మధుమేహంతో పాటు అధికరక్తపోటు, అతినిద్ర, సోమరితనం అలవడతాయి. రాత్రివేళ మాత్రమే కాదు, పగటిపూట కూడా అధికంగా కేలరీలు ఉండే నూనె, కొవ్వు పదార్థాలు, ఎక్కువ గ్లూకోజ్‌ ఉండే స్వీట్లు, కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments