ఎముక పుష్టిని పెంచే ఆహారం ఏంటి?

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (22:56 IST)
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి.
 
విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్‌ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది.
 
నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. విటమిన్ డి కోసం కొద్దిసేపు ఎండలో కూర్చోవాలి. చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు మొదలైనవి తింటుండాలి. ఎముకలను పటిష్టంగా వుండేందుకు తగినంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎందుకంటే ఎముకలు 50 శాతం ప్రోటీన్‌తో తయారవుతాయి.
 
గాఢ నిద్రలో ఉన్నప్పుడే గ్రోత్ హార్మోన్ స్రవిస్తుంది, ఇది ఎముకల అభివృద్ధికి దారితీస్తుంది కనుక గాఢ నిద్ర అవసరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

తర్వాతి కథనం
Show comments