శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే....

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (14:25 IST)
జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది.
 
యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను సమభాగాల్లో కలిపి చూర్ణం చేసుకొని భద్రపరుచుకోవాలి. కప్పు నీటిని మరిగించి, ఆ నీటిలో పావు చెంచా పొడి వేసి టీ లా కాచుకోవాలి. చివర్లో ఎనిమిది తులసి ఆకులు వేసి వేడివేడిగానే తాగాలి. ఇలా నిత్యం చేస్తే వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. 
 
కప్పు పాలల్లో అరచెంచా శొంఠి పొడి వేసి కలిపి కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలిపి తాగాలి. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను విడివిడిగా మెత్తాగా పొడి చేసి సమభాగాల్లో కలుపుకోవాలి. దీన్ని త్రికటు చూర్ణం అంటారు. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జర్వం, దగ్గు, జలుబు, అలర్జీని నిరోధిస్తుంది.
 
చెంచాల శొంఠి కషాయంలో ఒక చెంచాడు ఆముదం కలిపి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తే విరేచనం సాఫీగా అవుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. సయాటికా తగ్గుతుంది. ఇలా రోజు విడిచి రోజు మూడుసార్లు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉక్రెయిన్‌కు తగిన గుణపాఠం నేర్పుతాం : ఇరాన్ హెచ్చరిక

Pregnant Woman: గర్భస్రావం ప్రక్రియ తర్వాత మహిళ మృతి

ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు - తీర ప్రాంతాలకు హైఅలెర్ట్

తిరుపతిలో కొత్త కోవిడ్ కేసు- 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్

భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

MS Raju: అమ్మ వారి కథ తో అగధ, కనుక ఎల్లమ్మ–పోచమ్మ ఆశీస్సులతో ప్రచార జాతర

Rishab Shetty :స్పైడర్-మ్యాన్ పాత్ర నాకు ఎంతో నేర్పింది : రిషబ్ శెట్టి

Ram Charan surgery :డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నేడు రామ్ చరణ్ కు మణికట్టు సర్జరీ

Nani: ఆయా షేర్ సాంగ్ క్రేజ్ తో రికార్డ్ స్థాయిలో బిజిసెస్ అయిన ది ప్యారడైజ్

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

తర్వాతి కథనం
Show comments