Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోమలను తరిమికొట్టే చిట్కాలు.. లావెండర్ ఆయిల్‌తో..

దోమలను జ్వరానికి కారణమవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించేలా చేస్తున్నాయి. అలాంటి దోమలను తరిమికొట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి. బంతిపూల మొక్కలను ఇంటి పెరట్లో లేదా కుండీల్లో పెంచుకోవడం

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (12:10 IST)
దోమలను జ్వరానికి కారణమవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించేలా చేస్తున్నాయి. అలాంటి దోమలను తరిమికొట్టాలంటే.. ఈ  చిట్కాలు పాటించాలి. బంతిపూల మొక్కలను ఇంటి పెరట్లో లేదా కుండీల్లో పెంచుకోవడం ద్వారా దోమలను తరిమికొట్టవచ్చు. 
 
బంతిపూల మొక్కల నుంచి వచ్చే వాసనకు దోమలను పారదోలే గుణం వుంటుంది. అలాగే గదిలోని కిటీకీలను, తలుపులు మూసివేసి.. కర్పూరాన్ని వెలిగించి పది నిమిషాల పాటు వుంచితే మస్కిటోస్ ఫ్రీ జోన్‌గా మారిపోతుంది. అలాగే వేప నూనె, కొబ్బరినూనెను మిక్స్ చేసి చర్మానికి రాసుకోవడం ద్వారా దోమల బారి నుంచి తప్పించుకోవచ్చు. 
 
అలాగే ఆరుపాళ్లు వెల్లుల్లి రసానికి, ఐదుపాళ్లు నీరు కలిపిన ద్రావకాన్ని ఒంటికి రాసుకోవాలి. దీనివల్ల దోమలు కుట్టవు. తులసి మొక్కలను కిటికీల వద్ద వుంచడం ద్వారా ఇంట్లోకి దోమలు ప్రవేశించవు. ఇక లావెండర్ నూనెలతో వెలిగించిన దీపాలను మీ గదుల్లో వుంచడం ద్వారా దోమలను తరిమికొట్టవచ్చు. లావెండర్ రూమ్ ఫ్రెష్‌నర్ల ద్వారా దోమలను దూరం చేయవచ్చు. 
 
వేపనూనె, నిమ్మగడ్డి కాండం నుంచి తీసిన రసంతో దీపాలు వెలిగించినా దోమలు పారిపోతాయి. ఇక నీరు నిల్వ వుండే మురికి గుంటల్లో దోమలు గుడ్లు పెడతాయి. దీన్ని నివారించేందుకు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments