Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతాలు రంగు ఎందుకు మారుతాయో తెలుసా..?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (14:53 IST)
కొందురు ఎన్నిసార్లు తోమినా కూడా దంతాలు మాత్రం రంగు మారుతుంటాయి. పచ్చగా తయారవుతాయి. మాట్లాడేటప్పుడు ఎదుటి వారిలో పలచన భావన కనిపించే అవకాశం ఉంది. ఇందుకు మనం తీసుకునే నీరు, ఆహారమే ఈ సమస్యకు ప్రధాన కారణాలవుతాయి. 
 
తిన్న ఆహార పదార్థాలు దంతాలపై నిల్వ ఉంటే అవి రంగు మారే అవకాశం ఉంది. చాలా తీపి పదార్థాలు తీసుకోవడం వలన కూడా దంతాలు పాడవుతాయి. పిప్పి పళ్ళు, సిగరెట్లు, బీడీలు, పొగాకు, చుట్టలు కాల్చుట మొదలైనవి నమలడం వలన కూడా దంతాలకు హానికరమే. దంతాలు, చిగుళ్ళకు ఇన్‌ఫెక్షన్ వస్తుంది. 
 
దంతాలు విరిగిపోతాయి. దవడ ఎముకలు విరిగి పోతుంది. విటమిను సి, విటమిను డి లోపిస్తే శరీరంలో క్యాల్షియం శాతం తగ్గిపోయినా దంతాలు రంగు మారిపోతాయి. త్రాగు నీటిలో ప్లోరిన్ శాతం అధికంగా ఉంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు..
 
ప్రతి రోజు ఉదయం, రాత్రి నిద్ర పోవుటకు ముందు దంతాలను శుభ్రపరుచుకోవాలి. భోజనం చేసిన ప్రతి సారి స్వచ్చమైన నీటితో శుభ్రపరచాలి. మెడికేటెడ్ టూత్ పేస్ట్ వాడాలి. తరచూ దంత వైద్యుని చే పరీక్ష చేయించుకొని ఆయన సలహా మేరకూ నడుచుకోవాలి. చిన్నపిల్లలు చాక్లెట్లు తీపి పదార్థాలు తినిన వెంటనే నీటితో దంతాలు శుభ్రపరచాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వయసుకొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదు : బాంబే హైకోర్టు

సభకు రాకుండా జీతాలు ఇవ్వమంటే కుదరదు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం ... విపక్ష సభ్యులు సభకు రావాలి : అమిత్ షా

చెన్నై మెరీనా, బెసెంట్ నగర్ బీచ్‌ల్లో ఉచిత వై-ఫై సేవలు- పర్యాటకులకు ఇక ఫ్రీ

ఫ్లోరిడాలో 15 రోజుల పాటు మృత్యువుతో పోరాటం.. హనుమకొండ వ్యక్తి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor :సోషల్ మీడియా కంటెంట్ పై జాన్వీ కపూర్ కు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిదో తెలుసా ?

Yash: ఓవర్ సీస్ తోపాటు తెలుగులోనూ ఘనంగా టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్‌లు

Suriya : అదే మ్యాజిక్ ని తీసుకురావాలని వెంకీ, వంశీ అనుకుని తీశారు : హీరో సూర్య

#ChiruLeaks : మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ అదేనా?

హీరో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాట్లు...

తర్వాతి కథనం
Show comments