చిన్నతనంలోనే జుట్టు తెల్లబడిపోతుందా?

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (22:21 IST)
ఇటీవలకాలంలో చాలామందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడిపోతుంది. దీనికి కారణం అనారోగ్య సమస్యలు, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం. వీటిని అధిగమించడానికి కృత్రిమంగా తయారయన ఉత్పత్తులు పలు రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ అవి సరిపడకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. అలాకాకుండా సహజంగా లభించే పదార్థాలతో తెల్లజుట్టు సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. కొబ్బరినూనెలో నిమ్మరసం కలపి ప్రతిరోజు ఈ రసం తలకు రాసుకుంటే తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. అదేవిధంగా తెల్లజుట్టు రాకుండా ఉంటుంది.
 
2. ఉసిరి పొడి చేసుకుని అందులో నిమ్మరసం కలిపి పేస్టు మాదిరిగా చేసుకోవాలి. దానిని ప్రతిరోజు తలకు రాసుకుని రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
 
3. ఉల్లిపాయను మెత్తగా మిక్సీ చేయాలి. ఈ పేస్టును తెల్ల వెంట్రుకలు ఉన్న చోట రాయాలి. రెండు గంటలు ఆగిన తరువాత షాంపూతో స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది.
 
4. నువ్వులను మిక్సీలో వేసి పేస్టు చేయాలి. ఇందులో బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. దీనిని తరచుగా తలకు రాస్తుండాలి.
 
5. ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన కూడా జుట్టు నల్లబడుతుంది. అంతేకాకుండ మనం తీసుకునే రోజూవారి ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్, బి12 ఎక్కువగా ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ లిక్కర్ స్కామ్ : ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు

తిరుపతి లడ్డూ కల్తీ అంశం.. ఏకసభ్య కమిటీపై ఫైర్ అయిన వైకాపా

మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు చైనాలో డొనాల్డ్ ట్రంప్ పర్యటన

విదేశీ పర్యటనకు పట్టుబట్టిన భార్య.. నో చెప్పిన భర్త.. ఉరేసుకుని ఆత్మహత్య

యాచకుని వద్ద లక్షలాది రూపాయలు.. పెట్టెలో నోట్లకట్టలు.. బ్యాంకు ఖాతాలో..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalki 2 shoot: కల్కి 2 తాజా అప్ డేట్ - ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పై సన్నివేశాల చిత్రీకరణ

Varalakshmi: వరలక్ష్మి ని చూసి బాలయ్య గారు ఊర్వశి శారద తో పోల్చారు : గోపీచంద్ మలినేని

బ్యాండ్ మేళం నుంచి ఎనర్జిటిక్ సాంగ్ తిప్పుకుంటన్నవ్ రిలీజ్

Trigun: త్రిగుణ్ హీరోగా లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆకర్షిత చిత్రం ప్రారంభం

Anil Ravipudi : రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ జంట కిల్లర్ లో ఆసక్తికరంగా ఉంది : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments