Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోంపు గింజలు తింటే.. ఏమవుతుంది..?

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (10:24 IST)
నేటి తరుణంలో తరుచు అందరిని వేధించే సమస్య అజీర్తి. దీని కారణంగా ఆహారాన్ని భుజించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఒకవేళ తిన్నా కడుపులో వికారంగా, వాంతి వచ్చే మాదిరిగా ఉంటుంది. దాంతో కళ్లు తిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలని అడిగితే మెడికల్లో దొరికే మాత్రలు వాడితే చాలని చెప్తుంటారు. అది నిజమే అయినా ఎప్పుడూ ఆ మాత్రలే వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
 
సోంపు గింజలు: 
సాధారణంగా హోటల్‌కి వెళ్లినప్పుడు భోజనం తిన్న తరువాత వారు సోంపు ఇస్తారు. ఎందుకో తెలుసా.. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఇస్తారు. అందువలన మీరు కూడా అజీర్తి అనిపించినప్పుడు 1 స్పూన్ సోంపు గింజలు తీసుకుంటే.. తక్షణమే అజీర్తి నుండి ఉపశమనం లభిస్తుంది. సోంపులోని యాంటీ ఆక్సీడెంట్స్, పీచు పదార్థం ఈ సమస్యను తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతాయి. కనుక ప్రతిరోజూ భోజనాంతరం ఓ స్పూన్ సోంపు గింజలు తీసుకోండి చాలు...
 
అల్లం:
అల్లం ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. దీనిని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్లాన్ని ఏ కూరలో వేసుకున్నా ఆ కూరకి చక్కని రుచి వస్తుంది. తినడానికి చాలా బాగుంటుంది. ఈ అల్లాన్ని వంటకాల్లోనే కాదు.. టీలో కూడా వేసుకుంటారు. అల్లం తీసుకుంటే అజీర్తి ఉండదు. అల్లంలోని విటమిన్స్, న్యూట్రియన్ ఫాక్ట్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందించడమే కాకుండా.. కడుపులోని వ్యర్థాలను తొలగిస్తాయి. అజీర్తిగా అనిపించినప్పుడు.. అల్లం రసాన్ని తాగి చూడండి.. ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments