Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం ముక్కను నిప్పుల మీద కాల్చి తింటే....

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (14:18 IST)
అనారోగ్య సమస్య తలెత్తగానే వెంటనే మందుల షాపులకి పరుగెడుతుంటారు. ఏవో ఇంగ్లీషు మాత్రలు మింగి వాటితో సైడ్ ఎఫెక్ట్స్ రాగానే కిందామీదు అవుతుంటారు కొందరు. ఐతే సమస్య తలెత్తినప్పుడు ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. కొన్ని చిట్కాలు చూడండి.
 
1. అరకప్పు నిమ్మరసంలో కాస్త అల్లం రసం కలుపుకొని తాగితే దగ్గునుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజుకి రెండు మూడు సార్లు తాగితే ఫలితం ఉంటుంది. 
 
2. అల్లం ముక్కను నిప్పుల మీద కాల్చి తింటే వికారం తగ్గుతుంది. 
 
3. అయిదారు లవంగాలు, ఒక హరతి కర్పూరాన్ని కాటన్‌ క్లాత్‌లో కట్టి పంటినొప్పి ఉన్నచోట పెట్టి పళ్లతో గట్టిగా నొక్కి పట్టాలి. కాసేపటికి పంటినొప్పి తగ్గిపోతుంది. 
 
4. ఆస్త్మాతో బాధపడుతుంటే ఉప్పునీటి పాత్రను దగ్గర ఉంచుకొని పీలుస్తుంటే ఆ లక్షణాలు దూరమవుతాయి. ముక్కు పట్టేసినట్లుండటం కూడా తగ్గుతుంది. సైనస్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవాళ్ళు మామూలు ఉప్పుకు బదులుగా బేకింగ్‌ సోడా కలుపుకోవాలి. 
 
5. ఆస్త్మాతో బాధపడేవాళ్లు వెల్లుల్లి రేకలు వేసి మరిగించిన పాలు తాగుతుంటే వ్యాధి బాధించదు. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఒక గ్లాసు పాలలో మరిగేటప్పుడే మూడు లేదా నాలుగు వెల్లుల్లి రేకలను వేసుకుని తాగాలి. 
 
6. ఆరోగ్యంగా ఉండాలంటే తినటం, తాగటంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. శ్వాస తీసుకోవడంలో కూడా ఒక క్రమ పద్దతి పాటించాలంటారు నిపుణులు. దీర్ఘంగా ఉంటే ఊపిరితిత్తుల నిండుగా శ్వాసించాలి. 
 
7. ఇన్సులిన్ పని తీరును మెరుగుపరచటంలో వేప, నేరేడు, మెంతులు, కాకర బాగా పని చేస్తాయి. కాబట్టి వీటిని ఆయా కాలాలను బట్టి ఏ రకం అందుబాటులో ఉంటే వాటిని వాడాలి. తాజాగా సేకరించటం సాధ్యంకానట్లయితే ఇవన్నీ విడివిడిగా పౌడర్లు దొరుకుతాయి. వాటిని రోజూ ఉదయం ఒక టీ స్పూను, రాత్రి ఒక టీ స్పూను చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి. 
 
8. ఉల్లిపాయల్ని మెత్తగా నూరి ఆ ముద్దని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందుతాం. 
 
9. ఉసిరిక పొడి, శొంఠి, పిప్పిలి, మిరియాల చూర్ణం నెయ్యి బెల్లంలో కలిపి రోజు తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. 
 
10. ఉసిరి కాయ రసం, నిమ్మరసం, చెక్కెర కలిపి రోజుకు రెండు మూడు సార్లు తాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బైకుపై వెళుతున్న దంపతులు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే....

ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక

'లొంగిపో బిడ్డా... అందరం ప్రశాంతంగా బతుకుదాం' : ఉగ్రవాది కొడుక్కి తల్లి పిలుపు

భారత్‌పై దాడికి వందల కొద్దీ అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయ్ : పాక్ మంత్రి హెచ్చరికలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

తర్వాతి కథనం
Show comments