ఉల్లిపాయ రసానికి తేనె కలిపి రెండుసార్లు తాగితే...

ఉల్లిపాయలతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ముక్కు ద్వారా రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కట్ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూసినట్లైతే వెంటనే రక్తం రావటం ఆగిపోతుంది. ఉల్లిపాయ రసం లేదా ఉల్లిపాయ రసం, మంచినూనె సమపాళ్లలో కలిపిన రసాన్ని నాలుగ

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (22:08 IST)
ఉల్లిపాయలతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ముక్కు ద్వారా రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కట్ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూసినట్లైతే వెంటనే రక్తం రావటం ఆగిపోతుంది. ఉల్లిపాయ రసం లేదా ఉల్లిపాయ రసం, మంచినూనె సమపాళ్లలో కలిపిన రసాన్ని నాలుగైదు చుక్కలు తీసుకొని పుచ్చుపళ్లు ఉన్న దగ్గర పట్టిస్తే అందులోని పురుగు చచ్చిపోయి వెంటనే నొప్పిని తగ్గిపోతుంది.
 
ఉల్లిపాయ రసం అరకప్పు, తేనె చిన్నపాటి స్పూన్ చేర్చిన రసాన్ని ఉదయం, మధ్యాహ్నం రెండు వేళల్లో 25 రోజులు తాగినట్టు అయితే పురుషులలో వీర్యశక్తి బాగా పెరుగుతుంది. 
 
నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లను నిద్రపుచ్చేందుకు వంటింటి చిట్కాను ఉపయోగించవచ్చు. ఓ చిన్న ఉల్లిపాయని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రం తీసుకొని అందులో రెండు స్పూన్‌ల చక్కర చేర్చి ఇస్తే పిల్లలకి మంచి నిద్రవస్తుంది. 
 
చిన్న పిల్లలకు వచ్చే టాన్సిల్ వ్యాధికి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు చేర్చి తినాలి. తర్వాత గోరు వెచ్చని నీటిని తాగించినట్టయితే వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. 
 
కొంతమంది చిన్నారులకు చెవి నొప్పి ఉంటుంది. ఇలాంటి వారు ఉల్లిపాయ రసం తీసుకొని వేడిచేసి చలార్చిన తర్వాత చెవిలో వేసినట్టు అయితే చెవి నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలు ఎక్కువగా అయ్యే వారు ఉల్లిపాయ రసం అరకప్పు తీసుకొని గోరువెచ్చని నీటిని కలిపి అప్పుడప్పుడు తాగినట్లైతే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆప్ మాజీ అభ్యర్థి అనుమానాస్పద మృతి - ప్రియుడే చంపేశాడా?

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బిర్యానీలో ఈగ - రూ.లక్ష జరినామా

వెనెజువెలాలో భారీ భూకంపం.. లక్ష మంది మృతి? (Video)

సట్లెజ్ నదిపై గ్రావెల్ ట్రక్కు వెళుతుండగా కూలిన ట్రక్కు (వీడియో)

తిరుపతి జిల్లాలో నలుగురి ప్రాణాలు తీసిన విజిల్.. ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments