Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో వదలని జలుబు... ఈ చిట్కాలు పాటిస్తే...

వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు అంత త్వరగా తగ్గవు . ఒక్కోసారి మందులు వాడినా ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు మన ఇంట్లోనే ఉన్న కొన్ని పదార్థాలతో దగ్గుని తగ్గించుకోవచ్చు. వాత, పిత్త, కఫ దోషాల వలన దగ్గు వస్తుంది. ముఖ్యంగా దగ్గు మూడు రకాలుగా వస్తుంది. కఫంతో పా

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (18:18 IST)
వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు అంత త్వరగా తగ్గవు . ఒక్కోసారి మందులు వాడినా ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు మన ఇంట్లోనే ఉన్న కొన్ని పదార్థాలతో దగ్గుని తగ్గించుకోవచ్చు. వాత, పిత్త, కఫ దోషాల వలన దగ్గు వస్తుంది. ముఖ్యంగా దగ్గు మూడు రకాలుగా వస్తుంది. కఫంతో పాటు వచ్చే దగ్గు, కఫం లేకుండా వచ్చే దగ్గు, కంఠం లోపల గాయాల వల్ల రక్తంతో కలిసి కఫం వస్తుంది. దీనిని తీవ్ర స్థితిగా గుర్తించాలి. మరి ఈ దగ్గుని తగ్గించుకొనే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. కరక్కాయను పగులగొట్టి చిన్న ముక్కను బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్దికొద్దిగా మింగుతూ ఉంటే సాధారణంగా వచ్చే దగ్గు తగ్గిపోతుంది. చేదుగా, వగరుగా ఉండే కరక్కాయ రసం మంచి ఫలితాన్నే ఇస్తుంది.
 
2. గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలకుల పొడి, లవంగాల పొడి కలుపుకుని నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే మంచి గుణం కనిపిస్తుంది.
 
3. ఒక అర చెంచా అల్లం రసంలో ఒక చెంచా తేనె కలుపుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దానివల్ల కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుంది.
 
4. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా యాలకుల పొడి, మిరియాల పొడి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దగ్గు తగ్గి సుఖనిద్ర పడుతుంది. అలాగే మిరియాల కషాయం కూడా దగ్గుని తగ్గించడంలో సహాయపడుతుంది.
 
5. ఒక స్పూన్ తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫం వల్ల వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది. లేదా తులసి ఆకులను నమిలినా మంచి ఫలితం ఉంటుంది. 
 
6. శొంఠిని నీళ్లలో కలిపి కషాయంగా కాచి అందులో పటికబెల్లం కలుపుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. అలాగే శొంఠితో కాచే కాఫీ, టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

తర్వాతి కథనం
Show comments