Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ చిట్కాలతో ఒత్తిడి మటుమాయం...

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, లక్ష్య సాధన.. ఇలా కారణమేమైనప్పటికీ ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరిలోనూ కామనైపోయింది. దీంతో అది డిప్రెషన్‌కు దారి

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (13:27 IST)
హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, లక్ష్య సాధన.. ఇలా కారణమేమైనప్పటికీ ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరిలోనూ కామనైపోయింది. దీంతో అది డిప్రెషన్‌కు దారి తీసి చివరకు బలవన్మరణాలకు పాల్పడేలా చేస్తోంది. అయితే అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ఎవరైనా నిత్యం తమకు ఎదురయ్యే ఒత్తిడిని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. అందుకు ఏం చేయాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* ఒత్తిడిని తగ్గించే బ్రహ్మాస్త్రం వినోదం. జీవితంలో కేవలం ఇల్లు, ఆఫీసు, కాలేజీయే కాదు.. వినోదానికీ పెద్ద పీట వేయాలి. అందులో మునిగి తేలితే ఒత్తిడిని జయించినట్టే. 
* మెదడుకు పని చెప్పడం. అంటే పజిల్స్ నింపడం, పదవినోదం వంటివాటితో మెదడుకు పని చెప్పడం. అలాగే, వివిధ రకాల గేమ్స్ ఆడటం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. తద్వారా ఒత్తిడి మటుమాయమవుతుంది. 
* వ్యాయామంతో ఒత్తిడి చెక్. ఇందుకోసం ఈత కొట్టడం, ఇష్టమైన క్రీడలు ఆడడం, పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయాలి. 
* మనసును స్థిరంగా ఉంచుకునేందుకు యోగా సాధనం చేయాలి. యోగా సాధన వల్ల కేవలం ఒత్తిడి మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చు.
 
* ఒత్తిడిని జయించాలంటే ఒంటరి తనానికి దూరంగా ఉండటం. నలుగురిలో కలసి తిరగాలి. కొత్త ప్రదేశాలను సందర్శించాలి. సరదాగా గడపాలి. వీలైనంత వరకు సమస్యలను మరిచిపోయేందుకు ప్రయత్నించాలి. 
* వీటితో పాటు.. బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అంటే పాలు, బాదం పప్పు, నారింజ పండ్లు, పాలకూర, చేపలు తదితర ఆహారాలను రోజూ తీసుకుంటూ ఉంటే ఒత్తిడి దరిచేరదు. వీటిల్లో ఉండే పోషకాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అయోధ్య రామాలయం విరాళలపై పార్లమెంట్‍‌లో స్కిట్ : అతిథి పాత్రలో రాహుల్ గాంధీ

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి విడాకులు మంజూరు చేస్తాం : సుప్రీంకోర్టు

అరెస్టు చేసి చూడండి... మీ సంగతి తేలుస్తాం : న్యూయార్క్ మేయర్‌కు నెతన్యాహు హెచ్చరిక

భారతదేశ ప్రధాని చర్మం రంగును ప్రస్తావిస్తూ ఎగతాళిగా మాట్లాడితే చర్యలు ఏమిటి?

ఉధృతంగా గోదావరి పరవళ్లు - ఇసుక క్వారీల్లో చిక్కుకున్న 38 మంది కూలీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil : లెనిన్ తో వంద కోట్ల క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని

Anupama Parameswaran: పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో క్రేజీ కల్యాణం రాబోతోంది

Suriya: విశ్వనాథ్ & సన్స్ ప్రీమియర్లకు ప్లాన్, 30 కోట్ల శాటిలైట్ హక్కుల కోసం చర్చలు

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

తర్వాతి కథనం
Show comments