యవ్వనంగా ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటి?

సిహెచ్
బుధవారం, 27 మార్చి 2024 (17:47 IST)
ఆకలి వేస్తుంది కదా అని ఏదిబడితే అది తినేస్తుంటే శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా వయసుకి తగ్గట్లుగా కాకుండా త్వరగా వృద్ధాప్యాన్ని సమీపిస్తున్నట్లుంటుంది కొందరిలో. కనుక అలా కాకుండా వయసు పెరిగినా యవ్వనంగానూ, ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటో తెలుసుకుందాము.
 
బ్రోకలీ, క్యాబేజీ, అవకాడో, దోసకాయ, టొమాటో వృద్ధాప్యంతో ముడిపడి ఉన్న జన్యు మార్పులను నివారించి యవ్వనంగా వుండేలా చేస్తాయి.
 
ఉసిరికాయలు దీర్ఘాయువును ఇస్తాయంటారు, రోజూ 4 చెంచాల ఉసిరి రసం తాగుతుంటే వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకుంటుంది.
 
పసుపులో వున్న కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆయుష్షును పెంచడంలో సహాయపడుతుంది.
 
యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్న వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచి ఆయుర్దాయాన్ని పెంచుతుంది.
 
క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలు తింటుంటే దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా వుంటారు.
 
వాల్‌నట్స్, బాదం, పిస్తా వంటి గింజలు తింటే జీవితకాలం పొడిగించడానికి సహాయపడతాయి.
 
అవిసె గింజలు, చియా గింజలు, నువ్వులు వంటి విత్తనాలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
 
జీవితానికి అమృతంగా పరిగణించబడే తులసి రోగనిరోధక శక్తిని పెంచే మూలికగా చెప్పబడింది.
 
ఆరోగ్యంగా వుండాలంటే ఎక్కువసేపు కూర్చోవడం మానేయాలి, కూర్చున్న ప్రతి 20 నిమిషాలకు, కనీసం 8-10 నిమిషాలు నిలబడాలి.
 
ప్రతిరోజూ నడక తప్పనిసరి, సానుకూల దృక్పథం, సంతోషంగా వుండాలి, బాగా నిద్రపోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments