Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగాసనాలతో అద్భుతమైన శక్తులను... పొందాలంటే...

పతంజలి మహర్షి యోగాని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మెుదటిది ధ్యానసాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుగు దోహదపడుతుంది.

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (11:46 IST)
పతంజలి మహర్షి యోగాని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మెుదటిది ధ్యానసాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుగు దోహదపడుతుంది.
 
ఎనిమిది విధాలు:
 
యమ: ఒక సైనికుడి ఆయుధాలను అప్పగించినప్పుడు ముందుగా క్రమశిక్షణ నేర్పుతారు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలనే విషయంతో పాటు సమాజ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ఎలా ఉపయోగపడాలనేది అవగతం చేసుకుంటారు. జీవిత విధానంపై, ప్రవర్తనపై నిర్దిష్టమైన క్రమశిక్షణ ఉండాలి. దీనిలో ఐదు అంశాలున్నాయి. అవి,
 
1. అహింస
2. సత్యం
3. బ్రహ్మచర్యం
4. దొంగతనానికి పాల్పడకపోవడం
5. కోరికలను అదుపులో ఉంచుకోవడం
ఈ అయిదు అంశాలను పాటించినప్పుడే యోగ సాధకుడు ముందు అడుగు వేయగలడు.
 
నియమాలు: యోగా సాధన దేహంతోనే చేయవలసి ఉంటుంది. అందువలన శరీరం రోగగ్రస్తం కాకుడూదు. ఆరోగ్యంగా, ధృఢంగా ఉండాలి. ప్రకృతిలోని ఎటువంటి మార్పలు వచ్చిన తట్టుకునే శక్తి కలిగియుండాలి. వాంఛలు అదుపులో ఉంచాలి. సాధకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. ఆ అనంతశక్తిని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ కలిగి ఉండాలి. పతంజని మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:-
 
1. పరిశుభ్రత
2. సంతృప్తి
3. సంయమం
4. ధర్మశాస్త్రాల అధ్యయనం
5. ప్రతి చర్యను భగవత్‌ అర్పితం చేయడం
ఈ అయిదు నియమాలను పాటించడంతో సాధకుడికి మానసికంగా, శారీరకంగా మంచి ఫలితాలను పొందవచ్చును.
 
ఆసనాలు ప్రస్తుత కాలంలో యోగా పేరు చెప్పగానే అందరూ యోగాసనాల గురించే మాట్లాడుతున్నారు. హఠయోగంలో ఆసనాలు ఒక భాగం. పతంజని మహర్షి ఏనాడూ యోగాసనాలు పాటించాలని ఖచ్చితంగా చెప్పలేదు. కేవలం విశ్రాంతిగా, స్థిరంగా కూర్చునే ఆసనాన్ని మాత్రమే సూచించారు. పద్మాసనం కూడా అనుమతించారు. ఆసనాలతో శరీరంలోని భౌతికపరమైన ఇబ్బందులు తొలగుతాయి.
 
వేడి, చలిలాంటి ఉష్ణోగ్రత స్థితులపై అదుపు లభిస్తుంది. హఠయోగంలో పేర్కొన్న ఆసనాలను పాటించడంలో ఎటువంటి వ్యతిరేకత లేదు. కాని అత్యున్నతమైన సమాధిస్థితిని చేరుకోవడానికి ఇది ప్రామాణికం కాదు.
 
ప్రాణాయామం హఠ యోగంలో పేర్కొన్న వ్యాయామాల గురించి పతంజలి మహర్షి ఎలా నొక్కి చెప్పలేదో అలాగే శ్వాసక్రియ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. కేవలం ఏకాగ్రతతో, నెమ్మదిగా, గాఢంగా ఊపిరి పీల్చి వదలడం మాత్రమే ఆయన సూచించారు. ఇలా ఉచ్ఛాశ్వ, నిశ్వాసక్రియలు చేయడం వలన ఇంద్రియాలపై అదుపు ఏర్పడుతుంది. ఏకాగ్రతని వృద్ధి చేసేందుకు సహాయపడుతుంది. అనునిత్యం సాధనం చేయడం వలన మాత్రమే ఈ యోగాసనాలు సాధ్యపడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

తర్వాతి కథనం
Show comments