ఈ రోజు తలస్నానం చేస్తే...?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (14:35 IST)
తలంటు స్నానానికి వివాహాది శుభకార్యాలలో, పండుగలు మొదలగు రోజుల్లో తప్పక స్నానం చేయాలి. మామూలుగా అయితే తలంటు స్నానం చేయడానికి బహుళ అష్టమి, అమావాస్య, పూర్ణిమ, సంక్రమణాలు, మాసశివరాత్రులు, శుక్ల అష్టమి, ద్వాదశి, పాడ్యమి, షష్ఠి, చతుర్ధశి, శ్రాద్ధం రోజులు, ప్రయాణం రోజు, దీక్షామధ్యలో, అశ్విని, ఆర్ధ్ర, శ్రవణం, జ్యేష్ఠ, స్వాతి నక్షత్రాలలో, మంగళ, గురువారాలలో తగదు. ధనాన్ని కోరుకునేవారు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత తలస్నానం చేయాలి. మరి వారాల విషయానికి వస్తే.... 
 
ఆదివారం: ఈ రోజున తలస్నానం చేస్తే అందం తగ్గుతుంది. కలత, సంతాపం కలుగుతుంది. కానీ అవసరమైతే నూనెలో పువ్వులు వేసి తలంటుకుని తలస్నానం చేయవచ్చు. 
 
సోమవారం: ఈ రోజున తలస్నానం చేయడం అంత మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఒకవేళ చేస్తే కాంతి హీనత, భయం ఉంటుందట.
 
మంగళవారం: ఈ రోజు తలస్నానం చేస్తే విరోధం, అపాయం, ఆయుఃక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది.
 
బుధవారం: ఈ రోజు తలస్నానం చేస్తే అన్నివిధాలా శుభం.
 
గురువారం: అశాంతి, విద్యా లోపం, ధన వ్యయం, కీడు, శత్రు వృద్ధి. అవసరమైతే నూనెలో గరిక వేసి తలంటు స్నానం చేయాలి. 
 
శుక్రవారం: ఈ రోజున తలస్నానం చేస్తే అశాంతి, వస్తునాశం, రోగప్రదం. కానీ కొందరు సౌఖ్యప్రదమని అంటారు.
 
శనివారం: ఈ రోజున తలస్నానం చేయడం వలన ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ, కుటుంబ సౌఖ్యం, భోగం, శుభం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రశ్నపత్రాల లీక్ చేయాలంటేనే ఇకపై వెన్నులో వణుకు పుడుతుంది : కిషన్ రెడ్డి

మతం మారితే ఎస్సీ హోదా రద్దు : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

తూర్పు గోదావరి జిల్లాలో కనిపించిన మగపులి.. రేడియో కాలర్ ద్వారా...?

అయోధ్య విరాళాల చోరీ కేసు : 2 వారాల్లో సమగ్ర నివేదికకు సుప్రీం ఆదేశం

ఏనుగుకు బెల్లం పెట్టేందుకు వెళ్లిన వ్యక్తిని నేలకేసి కొట్టి తొక్కి చంపేసింది, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

రూ.11.70 కోట్ల వ్యయంతో సింహాచలంలో గిరి ప్రదక్షణ రహదారి

27-07-2026 సోమవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు.. ముఖపరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త...

ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

తర్వాతి కథనం
Show comments